Balakrishna, Ravi Teja: 15ఏళ్ళ వివాదం… బాలయ్య- రవితేజ బాగానే కవర్ చేశారట..!

  • December 22, 2021 / 05:58 PM IST

సాధారణమైన మనుషుల్లోనే.. ఒకరి మధ్య ఒకరికి గొడవలు చోటు చేసుకోవడం సహజం. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్ కి ఒకరి పై పగ సాధించే సమయం పెట్టుకోవడం అంటే మూర్ఖత్వమే అవుతుంది. అందుకే సందర్భం వచ్చినప్పుడు గొడవలు పడ్డవాళ్ళు సమాధానపడిపోతారు. తర్వాత కలిసి మెలిసి తిరుగుతారు. ఇలాంటి వాటికి సినీ పరిశ్రమ ఏమీ అతీతం కాదు. వాళ్ళలో కూడా ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు ఉంటాయి. కాకపోతే ఎక్కువగా కెమెరా ముందు కనపడాల్సి ఉంటుంది కాబట్టి..

వాటిని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించుకోవాలనుకుంటారు. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. గతంలో అంటే 2006 లో రవితేజకి బాలయ్యకి మధ్య ఏదో వివాదం చోటు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఓ దశలో బాలయ్య.. రవితేజ పై కూడా చెయ్యి చేసుకున్నాడు అనేది ఈ వార్త సారాంశం.అప్పటి నుండీ వీళ్ళ మధ్య మాటలు కూడా లేవు అంటారు. ‘బలుపు’ సినిమాలో రవితేజ.. బాలయ్యని ఇమిటేజ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది.

అలాగే ‘కిక్2’ లో కూడా ‘సారి చెప్పారా బాలిగా’ అనే డైలాగ్ కూడా ఉంటుంది. అయితే ‘ఆహా’ లో బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ కి గెస్ట్ గా రవితేజ వచ్చాడు. బాలయ్యని హగ్ చేసుకున్న వెంటనే అతనికి ఎదురైన మొదటి ప్రశ్న.. ‘ఏంటి నీకు నాకు మధ్య పెద్ద గొడవ జరిగిందట’ అని..! దీనికి రవితేజ ‘పని పాట లేని ప్రతీ డ్యాష్ నా డ్యాష్ గాళ్ళకి ఇదే పని’ అంటూ సమాధానం ఇచ్చాడు. నిజానికి ‘అన్ స్టాపబుల్’ షో ప్రారంభమైనప్పటి నుండీ ఇలాంటి కవరింగ్లే జరుగుతున్నాయి.

ఈసారి కూడా అంతే..! పనిలో పనిగా రవితేజ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఇష్యు గురించి కూడా ఓ ప్రశ్న అడిగేశాడు బాలయ్య. రవితేజ ఆన్సర్ ఏమిచ్చి ఉంటాడు అనేది ఫుల్ ఎపిసోడ్ లో చూడాలనే విధంగా ప్రోమోని కట్ చేశారు.దీంతో ఈ షో పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘ఇది కవరింగ్ ల షో’ అని ఒకరు ‘కవరింగ్ లు ‘అన్ స్టాపబుల్’ అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే ‘ఆడియెన్స్ కు క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో ఆర్జీవీని మించిపోయాడు అల్లు అరవింద్’ అంటూ చెప్పుకొస్తున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus