రమ్యగారి పై మళ్ళీ అవే పుకార్లా..?

‘బాహుబలి’ సిరీస్ తరువాత సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణకు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. సౌత్ లో ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి అన్నది నిజం. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘గ్యాంగ్’ ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘హలో’ ‘సూపర్ డీలక్స్’ వంటి అనేక చిత్రాల్లో నటించి మరింతగా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ‘బిగ్ బాస్ సీజన్3’ రెండు ఎపిసోడ్ లు కూడా చేసింది. దానికి కూడా ఈమెకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ‘బిగ్ బాస్’ కూడా ఓ సీజన్ ను లేడీ హోస్ట్ చేస్తే బాగుంటుంది.. అంటే రమ్యకృష్ణ అయితేనే కరెక్ట్ అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక రమ్యకృష్ణ ఓ సినిమాలో నటిస్తుంది అంటే.. ఆ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈమధ్య కాలంలో పలనా సినిమాలో నటిస్తుంది అని పుకార్లు రావడమే తప్ప ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. తన భర్త కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రాజ మార్తాండ’ చిత్రంలో ఈమె నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వరుణ్ తేజ్ కు తల్లిగా ఓ సినిమా అలాగే పూరి.. విజయ్ తో తెరకెక్కిస్తున్న ఫైటర్ లో ఓ రమ్యకృష్ణ నటిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. గోవాలో పూరి- ఛార్మి టీం తో కూడా ఈమె భేటీ పెట్టినట్టు ఓ ఫోటో రెవీల్ అయ్యింది. అయితే రమ్యకృష్ణ కేవలం ఫైటర్ లో మాత్రమే కాదు.. ఆకాష్ పూరి నటిస్తున్న ‘రొమాంటి’ చిత్రంలో కూడా నటిస్తుంది అని కూడా వార్తలు వచ్చాయి. వీటన్నిటి విషయంలో పుకార్లు మాత్రమే కానీ అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus