టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ గా కొనసాగుతున్నటువంటి వారిలో నా సమంత నాగచైతన్య దంపతులు ఒకరు. అయితే ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నటువంటి ఈ దంపతులు కొంతకాలం పాటు తమ బంధంలో సంతోషంగా ఉన్న అనంతరం విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని మూడు సంవత్సరాలు అవుతున్న వీరు విడాకుల గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా మరోసారి సమంత నాగచైతన్యల విడాకుల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమంత తాజాగా నటించిన ఖుషి సినిమా విడుదలవుతుంది ఇందులో భాగంగా సమంత విజయ్ దేవరకొండ పెళ్లి జరగాలి అంటే సమంత తండ్రి వీరి జాతకంలో నాడీకూటదోషం ఉందని వీరి పెళ్లి జరిగిన విడిపోతారని పిల్లలు కూడా పుట్టరు అంటూ చెబుతారు. అయినప్పటికీ ఈ సినిమాలో వీరిద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. అచ్చం ఈ సినిమాలు చూపించిన విధంగానే నిజ జీవితంలో కూడా సమంత నాగచైతన్య జాతకంలో ఈ విధమైనటువంటి దోషం ఉందని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే వీరి వివాహానికి ముందే వేణుస్వామి కూడా సమంత నాగచైతన్యల జాతకంలో దోషం ఉందని ఒకవేళ పెళ్లి చేసుకున్న విడిపోతారంటూ కూడా ఆయన చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ విధంగా సమంత నాగచైతన్య జాతకంలో దోషం ఉందని తెలిసి ముందుగానే ఈ దోషం తొలగి పోవడానికి హోమం చేసి ఉంటే
తప్పనిసరిగా సమంత (Samantha) నాగచైతన్య కూడా ఎంతో అన్యోన్యంగా వారి జీవితంలో కలిసి ఉండే వారని, ఇలాంటి వాటన్నింటినీ నాగార్జున నమ్మకపోవటం వల్లే సమంత నాగచైతన్య విడిపోయారు అంటూ మరోసారి సమంత నాగచైతన్య విడాకుల గురించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.