Bimbisara, Vishwambhara: చిరంజీవి విశ్వంభర సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్లిడి వశిష్టకు (Mallidi Vasishta)   దర్శకునిగా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ట బింబిసార (Bimbisara) సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా నిర్మాతగా కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కు సైతం మంచి లాభాలను హీరోగా విజయాన్ని అందించింది. మల్లిడి వశిష్ట రెండో సినిమాగా విశ్వంభర (Vishwambhara) మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైందని సమాచారం అందుతుండటం గమనార్హం. అయితే బింబిసార, విశ్వంభర మధ్య లింక్ ఉందని ఒక వార్త జోరుగా ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్త తెగ వైరల్ అవుతోంది.

అయితే వైరల్ అవుతున్న వార్త ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు. రెండు సినిమాలకు దర్శకుడు ఒకరే కావడంతో ఈ తరహా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయే తప్ప అంతకు మించి ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బింబిసార, విశ్వంభర మధ్య లింక్ ఉంటే మరో డైరెక్టర్ డైరెక్షన్ లో బింబిసార సీక్వెల్ ఎందుకు తెరకెక్కుతుందనే ప్రశ్నలు సైతం ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

విశ్వంభర సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని కథ, కథనం పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని తెలుస్తోంది. మల్లిడి వశిష్ట తర్వాత ప్రాజెక్ట్ లతో కెరీర్ బెస్ట్ హిట్లు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మల్లిడి వశిష్ట పాన్ ఇండియా హిట్లను అందుకుంటే కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

మల్లిడి వశిష్ట ఇతర డైరెక్టర్లకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. మల్లిడి వశిష్ట అద్భుతమైన కథలను ఎంచుకుని రాబోయే రోజుల్లో కూడా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus