పోస్టర్ చూసి కలవరపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నారు. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు టీజర్ కి ముస్తాబవుతోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 ఉదయం 9 గంటలకే టీజర్ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ కుర్చీపైనా ఠీవీగా కూర్చొని ఉన్నారు. స్టైల్ బాగానే ఉంది గానీ.. కుర్చీనే ఎన్టీఆర్ అభిమానులను కలవరపెడుతోంది. ఎందుకంటే త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞాతవాసి ట్రైలర్ లో కుర్చీ గురించి పవన్ కళ్యాణ్ భారీ డైలాగ్ చెప్పారు.

ఆ ట్రైలర్ చూసి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తీరా చూస్తే అజ్ఞాతవాసి త్రివిక్రమ్ కెరీర్ లో మచ్చగా మిగిలింది. అందుకే కుర్చీ అనగానే అజ్ఞాతవాసి గుర్తుకువస్తుంది. అదే సెంటిమెంట్ ఈ సినిమాకి కూడా వర్తిస్తుందా ? అని ఆందోళనపడుతున్నారు. అయితే అజ్ఞాతవాసి వల్ల తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడానికి త్రివిక్రమ్ అరవింద సమేత ని తెరకెక్కిస్తున్నారని చిత్రబృందం తెలిపింది. టీజర్, ట్రైలర్ మాత్రమే కాదు.. సినిమా అంతకన్నా బాగుంటుందని వెల్లడించింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్‌ 11న రిలీజ్ కానుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus