ప్రభాస్ వెంటపడుతున్న మ్యాట్రిమెని వెబ్ సైట్లు!

భీమవరం అమ్మాయితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయింది… ఇంజినీరింగ్ పూర్తి చేసిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు.. కృష్ణం రాజు తమ బంధువుల అమ్మాయిని కోడలిగా సెలక్ట్ చేశారు.. ఇలా ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటి వరకు అనేక రూమర్లు వచ్చాయి. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి తోటి నటి అనుష్కను పెళ్లి చేసుకున్నారని రహస్యంగా కాపురం చేస్తున్నట్లు గాసిప్స్ సృష్టించారు. వీటన్నిటిని ప్రభాస్ చిరునవ్వుతో కొట్టి పడేసారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. బాహుబలి తర్వాత నేషనల్ మీడియాకి కూడా ప్రభాస్ పెళ్లి ప్రముఖ వార్త అయింది.

అందుకే కొన్ని మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ వారు ప్రభాస్ వెంటపడుతున్నారు. అతను ఒకే అంటే తమ పంట పండినట్టేనని భావిస్తున్నారు. తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని కోరుకుంటున్నారు. కోరినంత ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. అయినా ప్రభాస్ ది అదే చిరు నవ్వు. భారీ మొత్తాన్ని సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం ప్రభాస్ యువ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. ఎంతమంది తన మూడ్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా.. బాహుబలి తో వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకోవాలని కష్టపడుతున్నారు. అత్యంత సాహోసోపేతమైన యాక్షన్ సీన్స్ చేయడానికి సాధన చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విన్యాసాలు అందరినీ అలరించనున్నాయని చిత్ర బృందాన్ని ధీమా వ్యక్తం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus