ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా తారకరత్న కెరీర్ మొదలైందనే సంగతి తెలిసిందే. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాలోని పాటలు కూడా అంచనాలకు మించి హిట్ అయ్యాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారు. అయితే తారకరత్న ఫస్ట్ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మొదట తారకరత్న సినీ ఎంట్రీ కోసం రాఘవేంద్రరావు పేరును పరిశీలించడం జరిగింది. అటు నందమూరి మోహనకృష్ణ, ఇటు అల్లు అరవింద్ తమ వారసులతో రాఘవేంద్రరావు 100వ సినిమా తీయాలని కోరారు. మొదట టాప్ హీరోతో 100వ సినిమా చేయాలని అనుకున్న రాఘవేంద్రరావు సైతం తన నిర్ణయాన్ని మార్చుకుని చివరకు అల్లు అర్జున్ తో గంగోత్రి మూవీని మొదలుపెట్టారు.
అదే సమయంలో మోహనకృష్ణ బాధ పడకుండా ఒకటో నంబర్ కుర్రాడు స్క్రిప్ట్ ను సిద్ధం చేసి ఇచ్చారు ఈ సినిమా బి.గోపాల్ లేదా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కించాలని మోహనకృష్ణ భావించగా ఆ ఇద్దరు దర్శకులు ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి అంగీకరించారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు సూచనల మేరకు కోదండరామిరెడ్డిని ఫైనల్ చేశారు.
ఒకటో నంబర్ కుర్రాడు కమర్షియల్ గా సక్సెస్ సాధించినా తర్వాత సినిమాల ఫలితాలు తారకరత్నకు భారీ షాకిచ్చాయి. తారకరత్న మరణం ఫ్యాన్స్ ను ఎంతగానో హర్ట్ చేసింది. ఈరోజు తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తారకరత్న మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. నందమూరి కుటుంబంలో చోటు చేసుకుంటున్న అకాల మరణాలు ఫ్యాన్స్ ను సైతం బాధ పెడుతున్నాయి. తారకరత్న భౌతికంగా మరణించినా సినిమాల ద్వారా జీవించే ఉన్నారు. తారకరత్న ఎంతో మంచి వ్యక్తి అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.