ఎన్టీఆర్, త్రివిక్రమ్ టీమ్ కి ఎనర్జీని ఇచ్చిన సర్వే ఫలితం!

అజ్ఞాతవాసి సినిమా ఫలితం తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలా ? వద్దా ?.. అని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. ఒక్క సినిమా అపజయం పాలైనంత మాత్రానా మాటల మాంత్రికుడిపై  తనకు అభిమానం, గౌరవం, నమ్మకం కొంచెం కూడా తగ్గలేదని ఎన్టీఆర్ అభిమానులతో స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కి ఈ సినిమా చేయడంలో ఎటువంటి సందేహం లేదని తెలిసిపోయింది. మరి అభిమానులు ఏమనుకుంటున్నారు? .. ఇదే అంశంపై ఓ న్యూస్ ఛానల్ వాళ్ళు సర్వే నిర్వహించారు. 2018లో రానున్న తెలుగు చిత్రాల్లో ఏది క్రేజీయెస్ట్ మూవీ అని సర్వే చేపట్టింది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీ ‘రంగస్థలం’, మహేశ్ బాబు – కొరటాల శివ కలయికలో వస్తున్న “భరత్ అనే నేను”, అల్లు అర్జున్ “నా పేరు సూర్య”, ప్రభాస్ “సాహో”, తారక్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కే సినిమాలలో దేనికోసం మీరు ఎదురుచూస్తున్నారు ? అని సినీ ప్రేక్షకులను అడగగా వారు ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చారు. ఈ సర్వేలో పాల్గొన్న వాళ్లలో 70 శాతం మంది తారక్, త్రివిక్రమ్ సినిమా అని చెప్పారు. ఈ సర్వే ఫలితం   ఎన్టీఆర్ తో పాటు ఈ చిత్ర బృందానికి ఉత్సాహాన్నిచ్చింది. అజ్ఞాతవాసి దెబ్బకి నిరాశలో ఉన్న నిర్మాత రాధాకృష్ణకి ఈ ఓటింగ్ ఎనర్జీని ఇచ్చింది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus