Actress: ప్రముఖ నటి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

కొంతమంది నటీనటులు ఒకటి, రెండు సినిమాలకే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కొందరికి ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు ఉండదు. అయితే చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించిన నటులు చాలామందే ఉన్నారు. అలా ఆకట్టుకున్న భామ అనీషా అల్ల. అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండ ఫ్రైండ్‌గా అనీషా చిన్న పాత్ర చేసింది. కానీ ఈమె ఆ పాత్రతో బాగా గుర్తిండిపోయింది. ఇక అనీషా స్టార్‌ హీరో విశాల్‌తో నిశ్చితార్థం చేసుకుని బాగా పాపులర్ అయింది.

హీరో విశాల్ ఈ అమ్మడితో 2019లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వీరి వివాహం రద్దు అయింది. వీరిద్దరి మధ్య మనస్పర్దలు రావటంతో విడిపోయారని తెలిసింది. ఇక అనిషా, విశాల్‌ ఇద్దరూ వారి సినిమాలతో బిజీ అయిపోయారు. అనీషా ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతుందంటూ కొన్నాళ్ల కిందట వార్తలు వినిపించాయి. వాటి గురించి ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు.

ఇక అనిషా (Actress) చివరిగా సెహరి అనే సినిమాలో నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఓ రేంజ్‌లో మారిపోయింది. ఆమె తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక విశాల్‌ తమిళ నటుడు, దర్శకుడు అర్జున్ వద్ద సహాయ దర్శకునిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత 2004లో చెల్లమే అనే సినిమాతో కథానాయుకుడిగా తెరంగేట్రం చేసి సందకోళి, తిమిరు, సినిమాలతో విజయం అందుకున్నారు.

తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పాండియ నాయుడు, నాన్ సిగప్పు మనిథన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు విశాల్. తెలుగులో విశాల్.. పందెం కోడి, భరణి, ప్రేమ చదరంగం, భయ్యా, పోగరు, వాడు వీడు, పల్నాడు, ఇంద్రుడు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విశాల్‌ తెలుగు వ్యక్తే అయినప్పటికీ తమిళంలో ఎక్కువ అవకాశాలు రావటంతో అక్కడే ఉండిపోయారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus