బిగ్ బాస్ సీజన్ 5 ఈసారి అనుకున్నంత కిక్ రాలేదు. అంతేకాదు, రేటింగ్ లో కూడా గత సీజన్స్ తో పోలిస్తే బాగా వెనకబడింది. దీనికి ప్రధానంగా అదే టైమ్ లో ఐపియల్ రావడం, ఐపియల్ అవ్వగానే ట్వంటీ ట్వంటీ మెన్స్ వరల్డ్ కప్ రావడం అనేది కూడా కారణంగా మారింది. బిగ్ బాస్ అన్ని సీజన్స్ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ 1 లో శివబాలాజీ హరితేజలో కాంబినేషన్, అలాగే ఆదర్స్, ప్రిన్స్ ఇద్దరి ఫ్రెండ్షిప్, అర్చన, దీక్షాసేత్ గ్లామర్, నవదీప్ హ్యూమర్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు, బుల్లితెరపై ఫస్ట్ టైమ్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన ప్రత్యేకమైన ముద్రని వేశాడు. యాంకరింగ్ లో దుమ్మురేపాడు.
పూణెలో జరిగిన ఈషో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే రికార్డ్ రేటింగ్ ని కైవసం చేసుకుంది. ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 2 ఎన్టీఆర్ యాంకరింగ్ చేయడం లేదని తెలిసి ఫ్యాన్స్ బాధపడ్డారు. కానీ నేచరల్ స్టార్ నాని ఆ లోటుని తీర్చాడు. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేశాడు. అయితే, తనకి కావాల్సిన వాళ్లకి ఫేవర్ చేస్తున్నాడు అంటూ నానిపై ఆయన ఫ్యాన్స్ సైతం ట్రోల్స్ చేశారు.
కౌషల్ మందాని కావాలనే టార్గెట్ చేస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లో తనకే టైటిల్ రావాలని సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీంతో నాని సీజన్ 3 చేయడానికి విముఖత చూపించాడు. సీజన్ 2 లో కౌషల్ తనీష్ వార్, గీతామాధురి , దీప్తి ల గేమ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. బిగ్ బాస్ షోకి కనివినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ సీజన్ నుంచీ బిగ్ బాస్ రివ్యూవర్స్ సైతం పుట్టుకొచ్చారు.
ఇక సీజన్ 3 చూసినట్లయితే కింగ్ నాగార్జున యాంకరింగ్ లో బిగ్ బాస్ షోకి ఒక కొత్త మార్క్ ని వేశాడు. అప్పట్నుంచీ ఆగకుండా సీజన్ 5 వరకూ ఈషోని తీసుకుని వచ్చాడు. సీజన్ 3 చూసినట్లయితే శ్రీముఖి, బాబాభాస్కర్ ఎంటర్ టైన్మెంట్ షోని నెక్ట్స్ లెవల్ కి తీస్కుని వెళ్లింది. అలాగే, రాహుల్ సిప్లిగంజ్ పునర్నవిల లవ్ స్టోరీ, వితిక వరుణ్ జంట షోని బాగా ముందుకు తీస్కుని వెళ్లాయి. అలీరైజా శివజ్యోతిల బాండింగ్ కూడా షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ షో తర్వాత సీజన్ 4 ఎలా ఉంటుందా అనే ఆసక్తిని రేకెత్తించింది.
ఇక సీజన్ 4 లో చూసినట్లయితే పులి మేక అంటూ అభిజిత్ అఖిల్ వార్, మోనాల్ లవ్ ట్రాక్, అరియానా , సోహైల్ ల అల్లరి , ముక్కు అవినాష్ ఎంటర్ టైన్మెంట్ షోని పైకి లేపాయి. అక్కడ్నుంచీ లాస్ట్ వీక్ వరకూ కూడా హౌస్ మేట్స్ మంచి ఎనర్జీతో పార్టిసిపేట్ చేశారు.
సీజన్ 4 తర్వాత లాక్డౌన్ లో విసిగి వేశారని జనం సీజన్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. కానీ, ఇప్పుడు సీజన్ 5లో ఏడువారాలు గడుస్తున్నా కూడా ఆడియన్స్ కి మాత్రం కిక్ రావట్లేదు. ఇక ఈసీజన్ పరమ బోరింగ్ గా ఉందని, నాగార్జున కూడా అస్సలు ఆసక్తిలేనట్లుగా యాంకరింగ్ చేస్తున్నాడని, హౌస్ మేట్స్ ని అడగాల్సిన పాయింట్స్ వదలేసి వేరేవి అడుగుతూ వారిని, ఆడియన్స్ ని కన్ఫూజ్ చేస్తున్నాడని బిగ్ బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక బిగ్ బాస్ పై జోకులు పేలుస్తూ నాగార్జునని సైతం ట్రోల్ చేస్తున్నారు. మరి మిగతా ఏడువారాలు ఈషోకి హైప్ పెంచేందుకు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!