Nani, Amitab: అమితాబ్ తో ఫోటోలు దిగిన నాని.. ట్రోలింగ్ షురూ..!

ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్టు కె’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ‘ప్రాజెక్ట్ కె’ కోసం నిర్మాత అశ్వినీ దత్ హైదరాబాద్లోని గచ్చిబౌలి లో ఓ కొత్త ఆఫీస్ ని తీసుకున్నారు. దీని ప్రారంభోత్సవ వేడుకకు ప్రభాస్, నేచురల్ స్టార్ నాని, రాఘవేంద్ర రావు, దర్శకుడు ప్రశాంత్ నీల్, మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లు హాజరయ్యారు.

వీరితో పాటు ‘ప్రాజెక్టు కె’ లో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ కూడా హాజరయ్యారు.ఈ క్రమంలో వీరంతా కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను అమితాబ్ సైతం తన ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే నాని మాత్రం ప్రభాస్, దుల్కర్ లేకుండా తాను అమితాబ్ తో దిగిన ఫోటోలని షేర్ చేశాడు. ఫాన్ బాయ్ మూమెంట్ అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్రభాస్, దుల్కర్ లేని ఫోటోలని షేర్ చేసినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ నాని పై మండి పడుతున్నారు.

ఆ విషయాన్ని పక్కన పెడితే… అసలు నాని ఎవరి ఫ్యాన్? ఒకసారి చిరంజీవి ఫ్యాన్ అంటాడు, ఇంకోసారి వెంకటేష్ ఫ్యాన్ అంటాడు.. ఇంకోసారేమో రజినీకాంత్ ఫ్యాన్ అంటాడు.. లేకపోతే కమల్ హాసన్ గారి ఫ్యాన్ అంటాడు.ఏదో వాళ్ళ అభిమానులను ఇంప్రెస్ చేయడానికి మాత్రమే అలా చెబుతుంటడా? అనే నెగిటివ్ కామెంట్లు కూడా నాని పై వ్యక్తమవుతున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అయితే…. నాని బాలకృష్ణ కి పెద్ద ఫ్యాన్ అని టాక్. అతను ఆర్.జె గా పనిచేస్తున్న టైం నుండి బాలకృష్ణకి వీరాభిమానిని అని చెప్పుకునేవాడట.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus