Keerthy Suresh: కీర్తి సురేష్ పై దారుణంగా ట్రోల్స్.. షామియానా అంటూ?

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లికి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే కీర్తి సురేష్ తల్లి మేనక క్లారిటీ ఇచ్చారు. అయితే కీర్తి సురేష్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక పెళ్లికి హాజరైన కీర్తి సురేష్ వేసుకున్న డ్రెస్ వల్ల వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.

కీర్తి సురేష్ డ్రెస్ ఏం బాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. షామియానాతో డ్రెస్ కుట్టించుకున్నావా అంటూ కొంతమంది కీర్తి సురేష్ డ్రెస్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. మరి కొందరు మాత్రం వ్యంగ్యంగా అవకాశాలు లేక కీర్తి సురేష్ ఇలాంటి డ్రెస్ లను వేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరి కొందరు మాత్రం కీర్తి సురేష్ ఇంద్ర ధనస్సును నేలకు తెచ్చిందని కామెంట్లు చేశారు.

తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి పెళ్లి తాజాగా గ్రాండ్ గా జరగగా ఈ పెళ్లిలో కీర్తి సురేష్ మెరిశారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన రంగ్ దే సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది. తనతో సినిమా తీసిన డైరెక్టర్ పెళ్లిలో కీర్తి సురేష్ రంగు రంగుల లెహంగాలో కనిపించడం గమనార్హం. కీర్తి సురేష్ కు ఫ్యాషన్ సెన్స్ అస్సలు లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నీ డ్రెస్ సెన్స్ కు నెగిటివ్ మార్కులు ఇవ్వాలని ఉందని కొంతమంది పేర్కొన్నారు. టెంట్ ను డ్రెస్ లా కుట్టించుకుందని కీర్తి సురేష్ పై కొందరు కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం షామియానా లెహంగా అంటూ కీర్తి సురేష్ పై ట్రోల్స్ చేస్తున్నారు. మంచి స్టైలిష్ ను పెట్టుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తుండగా కీర్తి సురేష్ డిజైనర్ ను చంపేయాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

 

 

 

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus