మెగా డాటర్ పై ట్రోల్స్ వర్షం.. నిహారిక చేసిన తప్పేముందని..!

వారసత్వం అనేది సినీ ఇండస్ట్రీ లో కూడా కామన్ అనేది అందరికీ తెలిసిందే. స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోలు తమ కుమారులని కూడా హీరోలుగా ఇంట్రొడ్యూస్ చేయడానికి రెడీ గా ఉంటారు. అయితే వారి కుమార్తెలను మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పెద్దగా ఇష్టపడరు. బాలీవుడ్ లో అయితే ఎంత పెద్ద హీరోలైనప్పటికీ వారి కుమార్తెలను హీరోయిన్లుగా పరిచయం చేయడానికి వెనుకాడరు. అంతేకాదు ఆ స్టార్ కిడ్స్ గ్లామర్ షో విషయంలో కూడా తగ్గరు అనేది తెలిసిన సంగతే. కానీ మన టాలీవుడ్ లో అయితే అలాంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ సినిమాల్లో చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగానో… నిర్మాతలు గానో ఎంట్రీ ఇస్తుంటారు. కానీ మెగాఫ్యామిలీ నుండి నాగబాబు కూతురు నీహారిక నటిగా ఎంట్రీ ఇచ్చింది.

ఈమె ఎంట్రీకి మొదట్లో ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే కాదు.. అభిమానులు కూడా అస్సలు ఒప్పుకోలేదు. అయితే కధకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని నిహారిక కన్వెన్స్ చేసి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకూ గ్లామర్ షో కి దూరంగానే ఉంటూ వచ్చింది. దీంతో యూత్ ను ఆకర్షించడంలో విఫలమయ్యిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు మెల్ల మెల్లగా గ్లామర్ షో చేయడానికి రెడీ అవుతున్నట్టు స్పష్టమవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నీహారిక తాజాగా తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో మోడర్న్ డ్రెస్ ధరించి క్లీవేజ్ షోతో అందరికీ షాకిచ్చింది. ఈ ఫోటోలకు యూత్ తెగ లైకులు కొడుతున్నారు. అయితే కొంతమంది హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ మాత్రం ‘ఇలా దిగజారిపోతున్నావేంటి నిహారిక’ అంటూ మండిపడుతున్నారు. అయితే ‘ఇదేమి ఎక్స్పోజింగ్ కాదని బయట చాలా మంది అమ్మాయిలు ఇలాంటి మోడరన్ డ్రెస్సులు వేసుకుంటున్నారని.. నిహారిక వేసుకుంటే తప్పేంటి’ అంటూ కొంతమంది ఆమెను వెనకేసుకొస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus