‘సాహో’ కొత్త సాంగ్ పై ట్రోలింగ్.. కావాలనే చేస్తున్నారా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం ఆగష్టు 30 న విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రోమో సాంగ్స్ ను విడుదల చేస్తూ వస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇప్పటికే ‘సైయాన్ సైకో’ పాటని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ” ఏ చోట నువ్వున్నా ” అనే పాటని విడుదల చేసారు. విజువల్ గా ఈ పాట చాలా గ్రాండ్ గా ఉంది. అయితే ఈ పాట కాపీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ‘ఈ కాపీ సాంగ్ ఏంట్రా బాబూ’ అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.

‘అసలే షూటింగ్ లేటైంది.. ఇప్పుడు విడుదల కూడా లేటయ్యింది.. కాబట్టి సినిమా బాగా వచ్చి ఉండదు’ అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘ఈ పాటల్లో తెలుగుతనం అస్సలు కనిపించడం లేదు… ఇది ‘పాన్ ఇండియా’ సినిమా కాదు బాలీవుడ్ సినిమా మాత్రమే’ అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. విడుదల సమయంలో ఇలాంటి కామెంట్లు రావడం మంచి పరిణామం అయితే కాదు. అయితే ‘ఇదంతా కావాలనే కొందరు చేస్తున్నారని’ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాటనే కాదు ప్రభాస్ లుక్స్ ను కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. మరి ముందు.. ముందు.. ఇంకా ఎలాంటి కామెంట్స్ వినిపిస్తాయి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus