వైరల్ అవుతున్న ‘సాహో’ కొత్త పోస్టర్లు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ‘బాహుబలి2’ తరువాత రెండేళ్ళ కు పైగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 30 న విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ చిత్రం ఆగష్టు 15 న విడుదల కావాల్సి ఉండగా.. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో 2 వారలు వాయిదా వేశారు. ఆ లోటుని భర్తీ చేయడానికి అదే రోజున ట్రైలర్ విడుదల చేయబోతున్నారని టాక్ నడుస్తుంది.

ఇదిలా ఉండగా.. నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారు తమ సోషల్ మీడియా ద్వారా ‘సాహో’ చిత్రం నుండీ రెండు పోస్టర్లను విడుదల చేశారు. ఒక పోస్టర్లో ప్రభాస్, హీరోయిన్ శ్రద్దా కపూర్ గన్ తో శత్రువుల పై దాడి చేస్తూ వున్నారు. మరో పోస్టర్లో ప్రభాస్ మాత్రమే గన్ పట్టుకుని దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే ఈ పోస్టర్ ‘టామ్ క్లాన్సీ రెయిన్ బో సిక్స్ సీగ్’ అనే గేమ్ కు కాపీ లా ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ‘సాహో’ టీజర్లో కూడా కొన్ని షాట్స్ ‘పబ్ జి’ గేమ్ లో లా ఉన్నాయంటూ కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus