Samantha: ఈ ఫేక్ యాక్సంట్ అవసరమా సమంత!

సమంత తాజాగా శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా భారీ స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సమంత సింపతి కార్డు ప్లే చేసినప్పటికీ సింపతి వర్కౌట్ కాలేదు అనే చెప్పాలి.ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోకపోవడంతో మేకర్స్ భారీగానే నష్టాలను ఎదుర్కొన్నారని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదలయి అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో సమంత తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.

తాజాగా ఈమె లండన్ లో సిటాడెల్ ప్రీమియర్ షోలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.ఎక్కడ తెల్ల చీర కట్టుకొని జపమాల ధరించిన సమంత దేశం మారగానే చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు.ఇలా సమంత లుక్ పై కూడా భారీ స్థాయిలో ట్రోల్స్ జరిగాయి. ఇక ఈ ప్రీమియర్స్ లో భాగంగా సమంత అక్కడ మీడియాతో మాట్లాడారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ ఈ వీడియో పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.

సమంత (Samantha) దేశం మారగానే వేషం మాత్రమే కాకుండా భాష కూడా మార్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరి కొందరు ఇంత ఓవరాక్షన్ అవసరమా అంటూ ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా సమంత మాట్లాడుతున్నటువంటి వీడియో పై మరికొందరు స్పందిస్తూ ఇది ఫేక్ యాక్సంట్ అంటూ ట్రోల్ చేయగా మరికొందరు మాత్రం సమంతకు మద్దతు తెలుపుతున్నారు.

ఇక ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలోప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు.


విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus