Nagarjuna, Sobhita: ట్రోల్స్ కు కూడా హద్దుండాలి.. కాబోయే కోడలిపై నిందలేయడం న్యాయమా?

స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు  (Nagarjuna)  సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేస్తే చైతన్య  (Naga Chaitanya)  శోభిత  (Sobhita Dhulipala) నిశ్చితార్థం తర్వాతే ఈ ఘటన జరిగిందని శోభిత అక్కినేని ఫ్యామిలీకి అన్ లక్కీ అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి చైతన్య శోభిత నిశ్చితార్థం ఈ నెలలో జరిగినా జరగకపోయినా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఆగేది కాదు.

Nagarjuna, Sobhita:

చైతన్య శోభిత రెండేళ్ల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. శోభితకు ఏ మాత్రం సంబంధం లేని విషయాలలో ఆమెను లాగడం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రోల్స్ కు కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుందని అక్కినేని ఫ్యామిలీకి కాబోయే కోడలిపై నిందలేయడం న్యాయమేనా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. శోభిత సైతం ఇలా నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ల విషయంలో సీరియస్ గా రియాక్ట్ కావాల్సి ఉంది.

సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకోవచ్చు కానీ ఇష్టానుసారం అభిప్రాయాలను వెల్లడిస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం సరి కాదు. శోభిత ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. శోభిత సినిమాలకు ఇకపై అక్కినేని అభిమానుల సపోర్ట్ కూడా ఉండనుందని సమాచారం అందుతోంది. శోభితకు ఈ మధ్య కాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

చైతన్య శోభిత పెళ్లికి మరో 5 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. చైతన్య రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. నాగచైతన్య శోభిత కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. చైతన్య, శోభిత పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటించి ఆ ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆ కారణాల వల్లే నాగ్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus