Varasudu: పోలికలు కుదిరాయంటూ కంగారు పడుతున్న విజయ్ ఫ్యాన్స్..!

తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. మన స్టార్స్‌కి గ్లోబల్ వైడ్ రికగ్నైజేషన్ వస్తోంది. ‘బాహుబలి’ తో ప్రభాస్, ట్రిపులార్‌తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ క్రెడిట్ దక్కించుకున్నారు. రీసెంట్‌గా జపాన్‌లో వాళ్లకున్న క్రేజ్ చూసి షాక్ అయ్యారంతా. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తమిళ్ స్టార్స్‌ని టాలీవుడ్‌కి తీసుకొచ్చి భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నేషనల్ అవార్డ్ యాక్టర్ ధనుష్, వెంకీ కుడుముల ’సార్‘ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతుండగా..

ఇళయ దళపతి విజయ్‌ని దిల్ రాజు తెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ సినిమాకి ’వరిసు‘ అనే తమిళ్ టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగులో ’వారసుడు‘ గా వస్తుందన్నారు. సంక్రాంతికి రిలీజ్ అంటూ ఇప్పటికే పలు పోస్టర్లు వదిలారు. విజయ్ బర్త్‌డే అప్పటినుండి ఇప్పటివరకు కనీసం ఒక్కటంటే ఒక్క తెలుగు పోస్టర్ కూడా విడుదల చెయ్యలేదు. అసలు ఇది బైలింగ్వెలా?.. లేక తమిళ్ సినిమానా? అనే సందేహమైతే ఇంకా తీరలేదు. నిర్మాత, దర్శకుడు ఇది కంప్లీట్ కోలీవుడ్ సినిమా అనే అంటున్నారు కానీ తెలుగు సంగతేంటనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు.

ఇక రీసెంట్‌గా వర్కింగ్ స్టిల్స్ కొన్ని తమిళ్ మీడియా బయటకి వదిలింది. ఆ పిక్స్ చూస్తుంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి తీసిన ’మహర్షి‘ మూవీనే గుర్తొస్తోంది. జయసుధ మదర్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. విజయ్ గెటప్, మహేష్‌కి తల్లి భోజనం వడ్డించడం.. ఇలా పలు ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి పోస్టర్లన్నిటినీ గమనిస్తే.. విదేశాల్లో ఉండే హీరో సొంతూరికి రావడం.. ఇక్కడేదో మార్పు కోసం ప్రయత్నించడం లాంటివి గుర్తొస్తున్నాయి.

అలాగే వర్కింగ్ స్టిల్స్ చూస్తే ’మహర్షి‘ తో చాలా దగ్గరి పోలికలున్నాయనిపిస్తోంది. దీన్ని బట్టి విజయ్, వంశీ సినిమా ఎక్కడో తేడా కొడుతుంది అంటూ మూవీ లవర్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘కొంపదీసి ’మహర్షి‘ తమిళ్ రీమేక్ కోసం మా హీరోని తెలుగు ఇండస్ట్రీకి తీసుకెళ్లారా ఏంటి?’’ అంటూ విజయ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. 2023 సంక్రాంతికి ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus