Major Movie: పెద్ద నిర్మాతలకు ఇది గుణపాఠం అవ్వాలంటున్న నెటిజన్లు.. ఏమైందంటే?.

  • May 26, 2023 / 04:25 PM IST

ఒకప్పుడు ఏ సెంటర్‌లో నచ్చిన సినిమా.. బి సెంటర్‌లో నచ్చదు అనేవారు. అయితే ఈ రెండు సెంటర్లలో ఎక్కడ నచ్చినా.. టీవీల్లో ఆ సినిమా హిట్టే అనేవారు. ఇంకా చెప్పాలంటే థియేటర్లలో నచ్చే సినిమా.. టీవీలో కూడా నచ్చుతుంది అనుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. థియేటర్లలో ఓ సినిమా బ్రహ్మరథం పట్టారు అంటే.. టీవీల్లోనూ ఆడాలని లేదు అని అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణగా ‘మేజర్‌’ సినిమాను చెప్పొచ్చు. అవును అడివి శేష్‌ ‘మేజర్‌’ సినిమానే.

అడివి శేష్‌ నటించిన ‘మేజర్‌’ (Major) సినిమాను పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేశారు. 2008 ముంబయి దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఆ రోజుల్లో మంచి అప్లాజ్‌ కూడా వచ్చింది. ఏడాది క్రితం వచ్చిన సినిమా మంచి వసూళ్లను కూడా పొందింది అని చెప్పాలి. ఏడాది క్రితం అనే మాటను గుర్తు పెట్టుకోండి లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఇక టీవీ విషయానికొస్తే.. సినిమాకు 1.70 టీఆర్పీ మాత్రమే వచ్చిందట.

బ్లాక్ బస్టర్ సినిమాలు మొదటిసారి టీవీలో ప్రసారమైనప్పడు తక్కువలో తక్కువ నాలుగు నుండి అయిదు మధ్యలో టీర్పీ వస్తుంటుంది. అలాంటిది ‘మేజర్‌’కు సగం కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అసలు ఏమైంది అనే చర్చ మొదలైంది. సినిమాను ఓటీటీలో చూసేశారు కదా.. ఇంకా టీవీల్లో ఎక్కడ చూస్తారు అని కొందరు అంటుంటే.. ఏడాది తర్వాత సినిమా టీవీల్లో వస్తే ఇప్పటివరకు చూడకుండా ఉంటారా అనేది మరో చర్చ.

దీనికి ఉదాహరణగా రీసెంట్ హిట్‌ ‘బలగం’ సినిమాను చెబుతున్నారు. ఈ సినిమా త్వరగా టీవీల్లోకి రావడంతో పదికిపైగా టీఆర్పీ సంపాదించింది అని చెబుతున్నారు. సినిమా పైరసీ కాపీలు బాగా సర్క్యులేట్‌ అవుతున్న ఈ రోజుల్లో ఏడాది వరకు టీవీలకు ఇవ్వకుండా ఉంటే ఇలానే ఉంటుంది అని చెబుతున్నారు. ఇదంతాక మేం తర్వాత మాట్లాడదాం అని చెప్పిన ఏడాది గుర్తుందా.. ఇందుకే అన్నాం.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus