సమంత నాగచైతన్యల విడాకుల ప్రకటన గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుండగా 80 శాతం మంది నెటిజన్లు తప్పు సమంతదేనని అభిప్రాయపడుతుంటే 20 శాతం మంది నెటిజన్లు మాత్రం చైతన్యదే తప్పు అని అభిప్రాయపడుతున్నారు. అయితే విడాకుల ప్రకటన తర్వాత సమంత చైతన్యలకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లల్ని కనే విషయంలో సమంత చైతన్యల మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ లలో ఒకరైన ఇమంది రామారావు తాజాగా సమంత అక్కినేని ఫ్యామిలీని వదులుకుని తప్పు చేసిందని అభిప్రాయపడ్డారు.
చైతన్య సమంతల విడాకులు బలవంతంగా జరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. సమంత తెలివైన అమ్మాయే అని అయితే తెలివి ఎక్కువయ్యే నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికైనా సమంత కలిసి ఉండాలని అనుకుంటే కోర్టు ఆ అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. చైతన్య కంటే మంచి మొగుడు సమంతకు రాడని సమంత తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం కాదని ఇమంది రామారావు చెప్పుకొచ్చారు. అక్కినేని కుటుంబానికి సమంత అంటే పంచ ప్రాణమని ఆయన తెలిపారు.
సమంతకు పిల్లలను కనడం ఇష్టం లేదని సరోగసీ అదీఇదీ అని ట్రై చేశారని ఆయన చెప్పుకొచ్చారు. నూరు సంవత్సరాల కాపురాన్ని సమంత ముక్కలు చేసుకోవడం సరి కాదని ఇమంది రామారావు వెల్లడించారు. రేపు సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నా అక్కడ మనస్పర్ధలు రావని గ్యారంటీ ఉందా? అంటూ ఇమంది రామారావు ప్రశ్నించారు. చాలా కుటుంబాలలో అభిప్రాయ భేదాలు వస్తుంటాయని ఇమంది రామారావు పేర్కొన్నారు.