షాకింగ్ పాయింట్ తో మెగాహీరో ఎంట్రీ!

టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న చిత్రాలలో ‘ఉప్పెన’ సినిమా ఒకటి. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ నుండి కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నారు. ఈ కథ సినిమాగా మారడానికి ముందు చాలా చర్చలు జరిగాయట. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉందట.

ఆ ట్విస్ట్ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుందట. ఓ పేదింటి కుర్రాడు.. ఓ పెద్దింటి అమ్మాయి మధ్య సాగే ప్రేమ కథే ఈ సినిమా. దర్శకుడు బుచ్చిబాబు నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడట. హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తన కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో హీరోని దారుణంగా శిక్షిస్తాడట. ఏ అబ్బాయికి వేయకూడని శిక్ష హీరోకి వేస్తాడట. ఇదే సినిమాలో పెద్ద ట్విస్ట్ అని సమాచారం.

సినిమాలో ఇది కొంచెం జీర్ణించుకోలేని విధంగా.. ఇప్పటివరకు తెలుగులో మరే సినిమాలోనూ చూడని విధంగా ఉంటుందట. నిజానికి ఇలాంటి అంశాలు తెలుగు సినిమాలో పెట్టడం పెద్ద సాహసమనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. ప్రయోగాత్మక సినిమాలు కూడా మంచి రిజల్ట్ ని అందుకుంటున్నాయి. అందుకే దర్శకుడు బుచ్చిబాబు ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus