Salaar: సలార్ సంచలనాలకు ఫ్యాన్స్ సిద్ధమా.. మూడు వేల కోట్ల బొమ్మ ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో పూర్తిస్థాయిలో అంచనాలను అందుకోకపోయినా కమర్షియల్ గా ఈ సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సలార్ మాత్రం ష్యూర్ షాట్ ఇండస్ట్రీ హిట్ అని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహం కూడా అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా టీజర్ ఈ నెల 7వ తేదీన రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

90 సెకన్ల నిడివితో ఈ టీజర్ రిలీజ్ కానుందని ఈ టీజర్ లో మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా ప్రభాస్ కనిపిస్తారని సమాచారం. సలార్ సంచలనాలను చూడటానికి అభిమానులు సిద్ధంగా ఉండాలని ప్రభాస్ వీరాభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ సినిమా 3,000 కోట్ల బొమ్మ అని అభిమానులు చెబుతున్నారు. భవిష్యత్తులో సలార్ సృష్టించే రికార్డులు బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని ఇందుకు సంబంధించి ఏ మాత్రం సందేహాలు అవసరం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ కు ఏకంగా పది రెట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సాధించే రికార్డులు మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సృష్టించే సంచలనాలను బాక్సాఫీస్ షేక్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. త్వరలో సలార్ ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోండగా త్వరలో ఇందుకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రభాస్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ క్రేజ్, రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ తన మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus