Kalki 2898 AD: 100 రూపాయల పెంపు కావాలని కోరిన కల్కి మేకర్స్.. కానీ?

  • June 22, 2024 / 11:53 AM IST

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD)   మూవీ రిలీజ్ కు మరో ఐదురోజుల సమయం మాత్రమే ఉంది. ప్రేక్షకులకు అర్థం అయ్యేలా సినిమా ఉంటే మాత్రం ఈ సినిమా సాధించే కలెక్షన్లు ఊహలకు సైతం అందవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజైన సినిమాలేవీ మరీ ప్రేక్షకులను ఊహించని స్థాయిలో మెప్పించలేదనే సంగతి తెలిసిందే. మరోవైపు కల్కి మేకర్స్ టికెట్ రేట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది.

నైజాంలో మల్టీప్లెక్స్ లలో 75 రూపాయలు, సింగిల్ స్కీన్స్ లో 100 రూపాయలు పెంపు కోసం దరఖాస్తు చేసుకోగా ఏపీలో మాత్రం అన్ని థియేటర్లలో 100 రూపాయల పెంపు కావాలని కోరినట్టు సమాచారం. అయితే టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. కల్కి సినిమా సెకండ్ ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కల్కి సెకండ్ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి సినిమా ప్రభాస్ కు భారీ హిట్ అందిస్తుందేమో చూడాల్సి ఉంది. కల్కి సినిమా సెకండ్ పార్ట్ కు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. కల్కి సినిమాకు ప్రమోషన్స్ మాత్రం గ్రాండ్ లెవెల్ లో చేస్తున్నారని సమాచారం అందుతోంది. 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కగా ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ స్థాయిలోనే జరిగింది.

ఈ ఏరియా ఆ ఏరియా అనే తేడాల్లేకుండా అన్ని ఏరియాలలో ఈ సినిమా టికెట్స్ కోసం ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది. కల్కి 2898 ఏడీ సినిమాకు థియేటర్లలో పోటీ అయితే లేదనే చెప్పాలి. కల్కి సినిమాకు హిట్ టాక్ వస్తే నాలుగు వారాల పాటు ఎదురులేనట్టేనని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus