టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో మహి వి రాఘవ్ ఒకరు. తక్కువ సినిమాలే చేసినా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ దర్శకుడు చేసిన సినిమాలు మంచి కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా గుర్తింపును సొంతం చేసుకున్న ఈ దర్శకుడు విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలకు రైటర్ గా, డైరెక్టర్ గా పని చేసి పాపులర్ అయిన ఈ దర్శకుడు ప్రస్తుతం యాత్ర2 సినిమాతో బిజీగా ఉన్నారు.
సీఎం జగన్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే యాత్ర సినిమాలో వైఎస్సార్ నిజ జీవితంలో జరిగిన ఘటనలనే మహి వి రాఘవ్ చూపించడం జరిగింది. అయితే యాత్ర2 సినిమాలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఫిక్షన్ జోడిస్తారని భోగట్టా. 2024 ఎన్నికలు టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా జగన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను, ప్రజలకు తెలియని జగన్ కు సంబంధించిన విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది.
యాత్ర2 (Yatra2) మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైందనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల వరకు జగన్ జీవితంలో జరిగిన ఘటనలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు. ఎన్నికల సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయడం వల్ల వైసీపీకి ప్లస్ అవుతుందేమో చూడాల్సి ఉంది. యాత్ర2 సక్సెస్ సాధిస్తే ఈ దర్శకుడి స్థాయి మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
పవన్ కళ్యాణ్ బయోపిక్ కూడా తీయాలని కొంతమంది పవన్ అభిమానులు ఈ దర్శకుడిని కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ దర్శకుడు ఎలాంటి సినిమాలను ఎంచుకుంటాడో చూడాల్సి ఉంది. యాత్ర2 సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉండనున్నాయని సమాచారం.