Jr NTR,Prashanth Neel: తొలిసారి అలాంటి ప్రయోగం చేయబోతున్న నీల్.. అస్సలు ఊహించలేరుగా!

సాధారణంగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో సినిమా అనగానే ఉగ్రం, సలార్ (Salaar) , కేజీఎఫ్ (K.G.F Chapter 2) సినిమాలలా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తారు. ఈ సినిమాలు వేర్వేరు సినిమాలు అయినా ఈ సినిమాల మధ్య కొన్ని పోలికలు ఉంటాయి. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో (Jr NTR) ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమా మాత్రం ఈ సినిమాలకు భిన్నమని తెలుస్తోంది. ఎన్టీఆర్ ను సరికొత్తగా చూపించేలా ప్రశాంత్ నీల్ అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం అందుతోంది. ఫ్యాన్స్ ఊహలకు అందని విధంగా ఈ సినిమా ఉండనుందని భోగట్టా.

జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ ను దర్శకులు సరిగ్గా వాడుకోలేదని చాలామంది అభిమానులు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మాత్రం తారక్ ప్రతిభను పర్ఫెక్ట్ గా వాడుకునేలా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది. మరో విధంగా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ తారక్ తో ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై చూడని ప్రయోగాత్మక సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది. తారక్ సైతం వైవిధ్యమైన కథాంశాలకు ఓటేస్తున్నారు.

ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలల క్రితం విడుదలైన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరోయిన్లకు మరీ ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఉండదు. ప్రశాంత్ నీల్ హీరోయిన్లను రిపీట్ చేయడానికి కూడా ఇష్టపడరు. తారక్ కోసం ప్రశాంత్ నీల్ ఏ హీరోయిన్ ను ఎంపిక చేస్తారో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందనే వార్తలు ఫ్యాన్స్ కు మరింత ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ వస్తే బాగుంటుందని మరి కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల చాలా ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. తారక్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దేవర ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus