‘గొడవ’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన అందం శ్రద్ధ ఆర్య. ఆ సినిమా ఆశించినంత గుర్తింపు ఇవ్వకపోయినా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది తర్వాత దూరమైంది. ఈ 34 ఏళ్ల అమ్మడు తాజాగా వివాహం చేసుకుంది. నేవల్ అధికారి అయిన రాహుల్ నాగల్‌ను పెళ్లి చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసింది. శ్రద్ధది అరెంజ్డ్ మ్యారేజ్ అని సమాచారం. శ్రద్ధ ‘గొడవ’ తర్వాత ‘కోతిమూక’, ‘రోమియో’ అంటూ కొన్ని యూత్ ఫుల్ సినిమాలు చేసింది.
కానీ అవేవీ ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయి సీరియల్స్ చేసుకుంటూ ఉంది. అలా ‘కసమ్ తేరే ప్యార్ కే’, ‘కుండలి భాగ్య’ వంటి సీరియల్స్‌తో టీవీలో అభిమానుల్ని సంపాదించుకుంది. తాజాగా పెద్దలు కుదర్చిన వివాహం చేసుకొంది. ముంబయిలో సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగిందని సమాచారం. సినిమాలు, టీవీలు కాకుండా శ్రద్ధ… మ్యూజిక్ వీడియోస్ కూడా చేసింది. జీనా, సోనియే హిరయే, మేరీ జాన్, పీకే, కార్ గబ్రు ది, విహా నై కరుణ,
గిల్టీ, నా మార్ లాంటి మ్యూజిక్ వీడియోస్ ఆమె నుండి వచ్చాయి. ఎంటర్టైన్మెంట్ కీ రాత్, ఖత్రా ఖత్రా ఖత్రా , ఇండియన్ ప్రో మ్యూజిక్ లీగ్ లాంటి షోస్‌కి గెస్ట్‌గా కూడా వెళ్లింది.