Shraddha Das: బుల్లితెర పై శ్రద్దా దాస్ బాగానే క్యాష్ చేసుకుంటుంది..!

  • August 5, 2022 / 03:45 PM IST

అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం’ చిత్రంతో నటిగా మారింది శ్రద్ధాదాస్‌. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో కలుపుకుని 30కి పైగా సినిమాల్లో నటించింది. కానీ ఈమె మెయిన్ హీరోయిన్ గా నటించిన సినిమాలు చాలా తక్కువ. ఎక్కువగా సెకండ్‌ హీరోయిన్ రోల్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది.ఈమె గ్లామర్ షోకి ఏమాత్రం తగ్గదు అన్న సంగతి తెలిసిందే. బోల్డ్ రోల్స్ కు కూడా ఈమె దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది.

‘ఆర్య2’ ‘డార్లింగ్’ ‘నాగ వల్లి’ ‘పి ఎస్ వి గరుడ వేగా’ ‘ఏక్ మినీ కథ’ మొదలగు సినిమాల్లో ఈమె నటించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే బుల్లితెర పై ‘ఢీ’ వంటి డ్యాన్స్ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ‘ ఢీ’ సీజన్ 14 కి ఈమె జడ్జిగా గా వ్యవహరిస్తూ అలరిస్తుంది.ఈమె గ్లామర్ కూడా ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని చెప్పొచ్చు. ప్రోమోల్లో కూడా ఈమెనే హైలెట్ చేస్తున్నారు.

అయితే ఈ షో కోసం శ్రద్ధాదాస్‌ తీసుకునే ఎంత ఉండొచ్చు అనే డిస్కషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె ఢీ షో కోసం రెండు ఎపిసోడ్లకు చొప్పున రూ.7 లక్షలు అందుకుంటుందట. అంటే ఒక్కో ఎపిసోడ్‌కు మూడున్నర లక్షల రూపాయలు అన్న మాట.

షూటింగ్ మాత్రం ఒక రోజులోనే రెండు ఎపిసోడ్లు జరుపుతారు. కాబట్టి ఒక్క రోజుకే ఈమె రూ.7 లక్షలు అందుకుంటుందన్న మాట. సినిమాల్లో ఈమెకు అవకాశాలు అంతంత మాత్రమే వస్తున్నప్పటికీ .. బుల్లి తెరపై మాత్రం బాగానే క్లిక్ అయ్యిందని చెప్పాలి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus