ప్రభాస్ ని కొత్త పేరుతో పిలిచిన శ్రద్ధా కపూర్!

బాహుబలి సినిమా వరకు ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ గా ఉన్నారు. ఆ చిత్రాల విజయంతో ఇండియన్ స్టార్ గా ఎదిగారు. జాతీయ మీడియా సైతం టాలీవుడ్ స్టార్ అని కాకుండా ఇండియన్ స్టార్ అని పిలవడం మొదలు పెట్టింది. మనదేశంలోని ప్రతి సినీ పరిశ్రమ ప్రభాస్ ని తమ హీరోగా ఓన్ చేసుకుంది. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ త్రి భాషా చిత్రాన్ని తీస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఇందులో దక్షిణాది నటులతో పాటు ఉత్తరాది నటులు సైతం కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్ లు విలన్ గా కనిపించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

హైదరాబాద్ లోని అమీర్ పేటలో వేసిన ఓ ఇంటి సెట్ సెట్ లో జరిగిన చిత్రీకరణలో శ్రద్ధ పాల్గొంది. షూటింగ్ సమయంలో చలాకీగా ఉంటూ యూనిట్ సభ్యులతో కలిసి పోయింది. అంతేకాదు ప్రభాస్ బాహుబలి సినిమాలు మాత్రమే కాదు, అతను నటించిన అన్ని సినిమాలు చూసానని చెప్పుకొచ్చింది. ఆ సినిమాలను చూసిన తర్వాత ప్రభాస్ కి ”ద న్యూ బ్లాక్‌ బస్టర్‌ కింగ్” అనే పేరు సూటవుతుందని వెల్లడించింది. ప్రభాస్ ని శ్రద్ధా సెట్లో అలాగే పిలుస్తోంది. బహుశా ఈ పేరు సాహో మూవీ తర్వాత నిలబడిపోతోందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో  ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus