అందుకే శ్రద్దా కపూర్ కు అంత భారీగా ఇస్తున్నారు

‘బాహుబలి2’ తరువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘బాహుబలి’ తో బాలీవుడ్లో కూడా ప్రభాస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. అంతేకాదు తమిళ, మలయాళ భాషల్లో కూడా ప్రభాస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే ‘సాహో’ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఇందుకోసం సినిమా మొదలుపెట్టేప్పుడు దీపికా ప‌దుకొనే, ఆలియా భ‌ట్ వంటి హీరోయిన్ల కోసం ప్ర‌య‌త్నించి చివ‌రికి శ్రద్దా కపూర్ ను తీసుకున్నారు.

ఈ చిత్రం కోసం హీరోయిన్‌ శ్రద్ధా కపూర్ ఎంత పారితోషికం తీసుకుంటుందనేదానిపై ప్ర‌స్తుతం చర్చ‌ జరుగుతుంది. ఈ చిత్రం కోసం శ్ర‌ద్ధ ఏకంగా 7 కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్‌గా తీసుకుంద‌ట‌. ‘సాహో’ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా స్ట్రయిట్ రిలీజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద మొత్తంలో శ్ర‌ద్ధ‌కు నిర్మాత‌లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus