శ్రద్ధాకపూర్ సినిమాని రీమేక్ చేస్తున్నారు

మంచి కంటెంట్ ఉన్న బాలీవుడ్ చిత్రాలు తెలుగులో రీమేక్ అవుతుండ‌డం స‌హజం. ఇటీవ‌ల రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధాకపూర్ జంటగా వ‌చ్చిన స్త్రీ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. హ‌ర‌ర్ కామెడీగా తెర‌కెక్కిన ఈ చిత్రం బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఓ స్త్రీ రేపు రా అని ప్రతి ఇంటి ముందు రాసి ఉంటుంది. రాత్రి పూట ఓ ఆడ దయ్యం వచ్చి యువ‌కుల‌ను ఎత్తుకెళ్లుతుందన్న భయం ఆ ఊళ్లో ఉంటోంది. 1980 దశకంలో ఇలాంటి సందర్భాలు కొన్ని రాష్ట్రాల‌లో ఎదురయ్యాయి.

అయితే ఆ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అమర్ కౌషిక్ ఈ సినిమాను డైరక్ట్ చేశాడు. ఇలాంటి సినిమాల‌ని తెలుగులోను ఆద‌రిస్తార‌ని భావించిన కొంద‌రు నిర్మాత‌లు ప‌క్కా స్క్రిప్ట్ త‌యారు చేయించి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని భావిస్తున్నార‌ట‌. ద‌ర్శ‌కుడు ఎవ‌రు, న‌టీన‌టులు ఎవ‌రైతే బాగుంటుంద‌నే విష‌యంపై ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus