బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో శ్రీరాపక గేమ్ ముగిసింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్ నుంచీ తప్పించుకున్నా కూడా సెకండ్ వీక్ నామినేషన్స్ లోకి వచ్చింది శ్రీరాపక. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచీ రెండోవారం ఎలిమినేషన్ కి గురి అయ్యింది. మనం ముఖ్యంగా శ్రీరాపక ఎలిమినేషన్ కి కొన్ని కారణాలు చూసినట్లయితే..,
1. శ్రీరాపకకి సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేదు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేవరకూ చాలామందికి శ్రీరాపక గురించి ఏమీ తెలీదు. అందుకే, ఓటింగ్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోయింది.
2. అరియానా గేమ్ స్ట్రాటజీలో శ్రీరాపక బలైపోయింది. నిజానికి శ్రీరాపకని ఎవరూ నామినేట్ చేయలేదు. ఒక్క అరియానా తప్ప, అది కూడా లాస్ట్ వీక్ నామినేషన్స్ రీజన్ ని బయటకి తీస్కుని వచ్చి మరీ అరియానా ఓటు వేసింది. దీంతో శ్రీ నామినేషన్స్ లోకి వచ్చింది. ఈ ఒక్క ఓటు తప్పించుకుని ఉంటే ఈవారం తన గేమ్ తో ఇంప్రెస్ చేసి ఉండేది. అరియానా స్ట్రాటజికల్ గేమ్ లో తనకంటే వీక్ కంటెస్టెంట్స్ ని తనతోపాటుగా నామినేషన్స్ లోకి తీస్కుని వస్తుంది. సీజన్ 4లో కూడా ఇదే స్ట్రాటజీ వాడి టాప్ 5 వరకూ వచ్చింది అరియానా.
3. శ్రీరాపక గేమ్ ఫస్ట్ వీక్ అస్సలు కనిపించలేదు. టాస్క్ లలో కూడా పెర్ఫామ్ చేసే స్కోప్ రాలేదు. అంతేకాదు, హౌస్ లో చాలా సైలెంట్ గా ఉంది. ఎక్కడా కూడా లీడ్ తీస్కుని ఛాలెంజర్స్ టీమ్ ని నడిపించే ప్రయత్నం చేయలేదు. చైతూ, శివ, బిందు, స్రవంతి వీళ్లని డామినేట్ చేయలేకపోయింది. ముఖ్యంగా మొదటి వారం అసలు ఎక్కడుందో కూడా కనిపించలేదు.
4. శ్రీరాపక గేమ్ సెకండ్ వీక్ నుంచీ పుంజుకున్నా కూడా వైల్డ్ గేమ్ ఆడింది. తనకి బొమ్మ తగిలినందుకు కక్ష్య సాధింపు చర్యగా ముఖ్యంగా బొమ్మలని విసిరేస్తూ చాలా రూడ్ గేమ్ ఆడింది. దీంతో వారియర్స్ ఆమెని అబ్జక్ట్ చేశారు. అయితే, బొమ్మలని స్మగ్లింగ్ చేయడంలో మాత్రం కీలకపాత్ర పోషించింది. కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచింది. కానీ, ఫస్ట్ రౌండ్ లోనే శ్రీరాపక ఓడపోయింది. ఇది కూడా ఆమె గేమ్ ని నిరూపించుకునే ఛాన్స్ ని వదలేసుకుంది. అప్పటికే సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఉండటం వల్ల ఓటింగ్ పర్సెంటేజ్ అనేది బాగా తగ్గింది.