Shriya: బేబీ బంప్ తో శ్రీయ శరన్ డ్యాన్స్.. వీడియో వైరల్..!

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీయ శ‌ర‌ణ్ ఇప్పటికీ పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. అయితే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఇంత కాలమైనా ఓ బిడ్డకి తల్లైనా ఈమె ఇంకా గ్లామర్ షో చేస్తూనే ఉంటుంది. ఇక సినిమాల్లో నటిస్తూ ఉండగానే ఈమె ర‌ష్యా క్రీడాకారుడు ఆండ్రీ కొస్చీవ్‌ను సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న ఈ బ్యూటీ అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. విదేశీయుడు కావడంతో శ్రీయ గ్లామర్ షోకి ఇతను ఏమాత్రం అడ్డుచెప్పడు..

Click Here To Watch NOW

పైగా బహిరంగంగానే వీళ్ళు రొమాన్స్ చేసుకుంటూ, లిప్ లాక్ లు పెట్టుకుంటూ ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఫస్ట్ లాక్ డౌన్ టైములో శ్రీయ ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే ఆ విషయం మీడియాకి లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడింది. గతేడాదిలోనే ఈమె ఆ విషయాన్ని రివీల్ చేసింది. ‘గమనం’ మూవీ ప్రమోషన్ల టైములో తన భర్త, పాప తో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని… ఈమె చెప్పుకొచ్చింది.

అంతేకాదు మాతృత్వంలో ఉండే ఆనందాన్ని కూడా ఈమె వివరించింది. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో సరోజినీ పాత్రలో కనిపించిన ఈ అమ్మడు.. కనిపించింది కాసేపే అయినా ఎమోషన్ ను పండించింది. అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌స‌న ఈమె నటించింది. ఇదిలా ఉండగా.. ఈమె ప్రెగ్నెంట్ గా ఉన్న టైములో బేబీ బంప్ తో డ్యాన్స్ చేసిన వీడియోని శ్రీయ తాజాగా బయటపెట్టింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus