Shriya: ఈ తరం వారు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇదే!: శ్రియ

హీరోయిన్ శ్రియ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మ్యూజిక్ స్కూల్. యామిని ఫిలిం పతాకంపై పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.తెలుగు తమిళ భాషలలో ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా చిత్ర బృందం చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నటి శ్రీయ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న సమయంలో తనకు షూటింగ్ కి వెళ్తున్నానని భావన కలగలేదని, ఇంటికి వెళ్తున్నానని భావన తనకు ఉండేదని తెలియజేశారు. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తనకు ఎంతో అందమైన తల్లిదండ్రులు ఉన్నారు. నా తల్లిదండ్రులు నేను చెప్పే ఏ విషయాన్ని అయినా తిరస్కరించే వారు కాదని అందుకే తాను ఏ పనినైనా చాలా సులభంగా చేయగలుగుతున్నానని తెలియజేశారు.

కానీ తమ బంధువులలో కొందరు ఇంటి నుంచి కాలు బయటికి పెట్టాలన్నా కూడా వారి తల్లిదండ్రులతో యుద్ధమే చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ సినిమా కథ వినగానే తాను ఇలాంటి విషయాలను అర్థం చేసుకున్నానని తెలిపారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ తరం వారికి ఇది సరైన సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు.

ప్రస్తుత కాలంలో ఎంతోమంది తల్లిదండ్రులు కేవలం చదువు అంటూ పిల్లలపై చాలా ఒత్తిడి చేస్తున్నారని, ఈ ఒత్తిడి కారణంగా వారు చాలా మానసిక ఒత్తిడికి గురవుతూ కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారని తెలిపారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు సంగీతం కూడా ఉండడం ఎంతో ముఖ్యమని చెప్పే సినిమానే మ్యూజిక్ స్కూల్ అంటూ శ్రియ తెలిపారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus