ప్రతి ఒక్కరి జీవితంలో బ్యాడ్ పాస్ట్, కష్టమైన గతం ఉన్నట్లే సినిమా హీరోయిన్ల లైఫ్‌లోనూ ఉంటుంది. అయితే ఒక స్థాయికి వచ్చాకనే ఆ విషయం బయటకు చెబుతారు. అంతేకాదు అప్పుడు చెబితేనే ఆ విషయం ఎక్కువమందికి చేరుతుంది కూడా. ఇప్పుడు హీరోయిన్లగా వాళ్లు స్టార్‌లు అయి ఉండచ్చు… గతంలో సగటు అమ్మాయిల్లా, యువతిలా ఇబ్బందులు పడే ఉంటారు. అలాంటి కొన్ని ఇబ్బందుల గురించి ప్రముఖ కథానాయిక శ్రియ మాట్లాడింది. దీంతో శ్రియ పాస్ట్‌లో ఇంత కష్టం ఉందా అని అనుకుంటున్నారు ఫ్యాన్స్.
మనసుకు దగ్గరగా వుండే పాత్రల్లో నటిస్తున్నప్పుడు కలిగే ఆనందమే వేరు అంటూ తన కొత్త సినిమా ‘మ్యూజిక్ స్కూల్’ను ప్రమోట్ చేస్తోంది శ్రియ. ఈ క్రమంలో తన పాస్ట్‌లో జరిగిన విషయాలను చెప్పుకొచ్చింది. డ్యాన్స్, సంగీతం నా జీవితంలో ఎప్పుడూ ముఖ్యమైన భాగాలే. నా చిన్నతనంలోనే కథక్ డ్యాన్స్ నేర్చుకున్నాను. కథక్‌లో గానం కీలకం కావడంతో సంగీతంపై కూడా కొంత పరిచయం ఉంది. ఆ తర్వాత స్టేజీపై డ్యాన్స్ డ్రామాలు వేశాను. ఆ అనుభవంతోనే ఈ సినిమాలో నటించాను అని చెప్పుకొచ్చింది.
పిల్లలపై చదువుల పేరుతో మితిమీరిన భారాన్ని మోపుతున్నారు. నా చిన్నతనంలోనూ ఇంచుమించు అలాంటి అనుభవాల్నే ఎదుర్కొన్నాను అంటూ నాటి రోజులు గుర్తు చేసుకుంది శ్రియ. ఆమె ఇంట్లో అందరూ బాగా చదువుకున్నవాళ్లేనట. దీంతో ఆమె చదువుకునే సమయంలో అయితే డాక్టర్ లేదంటే ఇంజినీర్ అవ్వాలి అనేలా అన్నట్టే మాట్లాడేవాళ్లట. దాంతో ఆమె కూడా ఒత్తిడికి గురయ్యేదట. అయితే అదృష్టవశాత్తూ వాళ్ల అమ్మ తనను నృత్యం వైపు ప్రోత్సహించారని చెప్పింది. అలా కథక్ నేర్చుకున్నానని చెప్పింది.
ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం కెరీర్ బాగానే ఉంది. నాకు (Shriya Saran) బాగా నప్పే కథలకే ఓకే చెబుతున్నాను. నా పాప రాధని ఇంటి దగ్గర వదిలి సెట్‌కి వస్తున్నా. అలాంటప్పుడు విలువైన కథల్లోనే నటించాలి కదా అని తన ఆలోచనను చెప్పింది శ్రియ. తర్వాత నా కూతురు నా సినిమాలు చూసినా, నా మాటలు విన్నా గర్వపడాలి కదా అంటూ సినిమాల ఎంపిక వెనుక కారణం గురించి చెప్పింది.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?