Shriya Saran: ప్రెగ్నెన్సీ విషయం తెలిస్తే బాడీ షేమింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది: శ్రియ

తెలుగు చిత్ర పరిశ్రమకు ఇష్టం సినిమా ద్వారా పరిచయమయి అనంతరం వరుస సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రీయ ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలు అందుకొని బిజీగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన శ్రీయ రహస్యంగా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఇలా తన పెళ్లి విషయాన్ని అందరికీ తెలియజేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చిన ఈమె తన ప్రేగ్నెన్సీ విషయంలో కూడా ఇంతే రహస్యంగా ఉన్నారు.

శ్రియ ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన ప్రేగ్నెన్సీ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా కూతురు జన్మించిన తర్వాత తనకు కూతురు పుట్టిందని తన కూతురు పేరు రాధా అని పెట్టినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విధంగా శ్రియా తన ప్రెగ్నెన్సీ గురించి దాచి పెట్టడానికి గల కారణాలు ఏంటి ఈ విషయాన్ని ఎందుకు అభిమానులతో పంచుకోలేదు అని వాటి గురించి తాజాగా ఈమె వెల్లడించారు. ఇక శ్రీయ తాజాగా నటించిన దృశ్యం 2సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ద్వారా ఈమె ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తన ప్రెగ్నెన్సీ దాచి పెట్టడానికి గల కారణాలను కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ… తనకు రాదా కడుపులో ఉన్నప్పుడు ఆ అందమైన క్షణాలను ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా గడపాలని కోరుకున్నాను.కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ లావుగా ఉండడంతో ఆ విషయం గురించి చింతించాను.

ఇక ఈ విషయం బయటకు తెలిస్తే చాలామంది నా బాడీ షేప్ గురించి రాస్తారు.నా బిడ్డ పై దృష్టి పెడతారు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండడం కోసమే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచాల్సి వచ్చిందంటూ ఈ సందర్భంగా ఈమె అసలు విషయం వెల్లడించారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus