సరికొత్త జీవితం మొదలెట్టిన శ్రీయ!

రెండు దశాబ్దాలపాటు కథానాయికగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించడమే కాక ప్రతి ఇండస్ట్రీలోని అందరు అగ్ర కథానాయకులతో జోడీగా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న శ్రేయ పెళ్లి గురించి కొన్నాళ్లుగా రకరకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే ఫైనల్ గా శ్రేయ మాత్రం సైలెంట్ గా, సీక్రెట్ గా తాను ఇష్టపడిన ఆండ్రీని ముంబైలో వివాహమాడింది.

హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన వారెవరు రాకపోవడం గమనార్హం. కేవలం తనకు అత్యంత సన్నిహితులైన వారిని మాత్రమే శ్రేయ ఆహ్వానించిందట. అయితే పెళ్లి జరిగి రెండ్రోజులవుతున్నా ఫోటోలేవీ బయటకి రాకపోవడంతో కన్ఫ్యూజన్ లో పడ్డారు శ్రేయ అభిమానులు. ఆ కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇస్తూ శ్రేయ పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. తన భర్త ఆండ్రీని చూస్తూ మురిసిపోతున్న శ్రేయ ముఖారవిందాన్ని చూసి ఆమె అభిమానులు ముచ్చటపడుతున్నారు. మరి ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి ఇదివరకటిలా సినిమాలు కంటిన్యూ చేస్తుందా.. లేక ఉన్న కమిట్ మెంట్స్ కంప్లీట్ చేసి కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకుంటుందా అనేది శ్రేయ చేతుల్లో ఉంది. ఏదేమైనా తాను ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లాడి కొత్త జీవితం మొదలెట్టిన శ్రేయ-ఆండ్రీ దంపతులకు ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus