RRR సినిమాలో నా పాత్ర సంతృప్తిని కలిగించింది!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రియ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా మ్యూజిక్ స్కూల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి శ్రీయ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు.

ఈ సందర్భంగా ఈమె తన సినిమాల గురించి మాట్లాడుతూ తాను ఒక సినిమా చేసి ఆ సినిమా హిట్ అయితే ఆ సినిమాని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలని డిజాస్టర్ అయిన సినిమాలను వదిలేయాలి అనేతత్వం తనది కాదని మనం ఏ సినిమా చేసిన ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తూ కష్టపడి చేస్తామని తెలిపారు. ఇక నేను నటించే ప్రతి సినిమా ఎంతో విలువైనదిగానే భావిస్తాను భవిష్యత్తులో నా కూతురు నా సినిమాలు చూస్తే నా గౌరవం పెరిగేలాగే ఉండాలి కానీ తగ్గేలా ఉండకూడదు అందుకు అనుగుణంగానే తాను సినిమాలు చేస్తానని తెలిపారు.

నేను ప్రతి పాత్రలోనూ నటించాను ఇప్పటికే ఎన్నో డిఫరెంట్ రోల్స్ లో నటించానని తెలిపారు. ఇక తాజాగా ఈమె రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. RRR సినిమాలో నా పాత్ర నాకు మంచి సంతృప్తిని ఇచ్చింది. రాజమౌళి దర్వకత్వంలో నేను నటించింది ఐదు రోజులు మాత్రమే కానీ..

జక్కన్న నా పాత్రను సినిమాలో పెట్టిన విధానంతోనే మంచి పాపులారిటీ లభించింది.మనం చేస్తున్న పాత్ర నిడివి ఎంత ఉంది అనేది ముఖ్యం కాదని ఆ పాత్రలో నటించడం వల్ల మనం ఎంత సంతృప్తి పొందాము అనేదే ముఖ్యమని ఈ సందర్భంగా శ్రేయ తన సినిమాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus