రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన శ్రేయ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన వెలుగు వెలిగినటువంటి నటి శ్రేయ గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె సీనియర్ అగ్ర హీరోలందరి సరసన నటించి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.ఇక ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస అవకాశాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి శ్రియ శరన్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ అందం విషయంలో యంగ్ హీరోయిన్లకు పోటీ పడుతూ సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.

తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో కలిసి మరోసారి స్టెప్పులు వేయబోతున్నారు. ఈ సినిమాలో ఈమె స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇదిలా ఉండగా తాజాగా గత కొద్ది రోజుల క్రితం ఇంటర్వ్యూలో పాల్గొని శ్రీయ తన అద్దం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రిపోర్టర్ శ్రేయాన్ని ప్రశ్నిస్తూ పెళ్లయి కూతురు ఉన్నప్పటికీ ఇంత అందంగా ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు.

అయితే శ్రీయ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇలాంటి ప్రశ్నలు హీరోలను అడిగే ధైర్యం మీకుందా అని ఎదురు ప్రశ్న వేశారు.తన స్నేహితులు కూడా చాలామంది పెళ్లయిన తర్వాత ఇంత అందం ఎలా సాధ్యమైందని తనని అడుగుతుంటారని ఈ సందర్భంగా ఈమె చెప్పారు.ఇక ప్రస్తుతం ఎక్కడ తనకు అందం ముఖ్యం కాదని తెలిపారు. తాను ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలలో నటించాను..

తన వయసు ఎంత? ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చాను అనే విషయాలే ముఖ్యమని తెలిపారు.ఇక మీరు ఈ ప్రశ్నని ఎప్పుడైతే హీరోలను అడుగుతారో అప్పుడే తాను కూడా సమాధానం చెబుతానని… మరి హీరోలను అడిగే ధైర్యం మీకుందా అంటూ ఈ సందర్భంగా శ్రేయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus