కలియుగ భగవానుడుని దర్శించుకోవడమంటే చాలామందికి ఇష్టం. సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా ప్రతి ఏడాది తిరుమల వెంకటేశ్వర స్వామిని చూసుకొని తరిస్తుంటారు. అయితే తిరుమలకు భక్తితో వచ్చే సెలబ్రిటీలకు అక్కడ కొన్ని చేదు సంఘటనలు ఎదురయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అభిమానులు, మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. సీనియర్ నటి శ్రియ 2008వ సంవత్సరంలో తిరుమల వచ్చిన సమయంలో చేదు అనుభవం ఎదుర్కుంది.
అప్పుడు తిరుమల వెంకటేశుని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మీడియా వారితో మాట్లాడుతుండగా వెనుక నుండి ఒక వ్యక్తి శ్రియ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో అతడి చెంప పగులకొట్టింది. అప్పట్లో ఆ సంఘటన పెద్ద సంచలనమైంది. అందుకే ఈ సారి చాలా జాగ్రత్త వహించింది. సంతోషంగా దర్శనం ముగించుకొని.. ఎవరికీ మొహం కనిపించకుండా కొంగుని కప్పుకుంది. అయినప్పటికీ కొంతమంది ఆ ఫోటోలను తీసి నెట్లో ఉంచారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి అయిన తర్వాత తిరుమలకి శ్రియ రావడం ఇదే తొలిసారని భావిస్తున్నారు. ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకూడదని మీడియాకి మొహం చాటేసిందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.