ఇండియన్ సినిమా హిస్టరీలో సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్‌ను ఏలడం కొత్త కాదు. ముఖ్యంగా “బాహుబలి 2” (Baahubali 2) తో మొదలైన ఈ జైత్రయాత్రను ఇప్పుడు “పుష్ప 2” (Pushpa 2 The Rule) మరో స్థాయికి తీసుకెళ్లింది. అల్లు అర్జున్ (Allu Arjun) నటన, సుకుమార్(Sukumar) దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం కలిసి ఈ సినిమాను బ్లాక్ బస్టర్‌గా మార్చాయి. హిందీ మార్కెట్‌లో ప్రత్యేకంగా ఈ సినిమా సృష్టించిన ప్రభావం సౌత్ సినిమాల ప్రభాకరాన్ని మరోసారి చాటిచెప్పింది. హిందీలో “పుష్ప 2” ఇప్పటివరకు 461 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
Pushpa 2 The Rule
కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం నిజంగా అరుదైన విషయం. ఈ వేగం చూస్తుంటే బాహుబలి 2 స్థాయిని ఈ సినిమా సులువుగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కేజీఎఫ్ 2 కలెక్షన్లను ఇప్పటికే పుష్ప 2ని దాటేయగా, బాహుబలి 2 కలెక్షన్ బ్రేక్ చేయడమంటే బన్నీ మరింత ఎలివేషన్ పొందినట్లే.
ఈ జాబితాలో పుష్ప 2 స్థానాన్ని మరో వారం రోజుల్లోనే మొదటి స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే వేగం కొనసాగితే, భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక హిందీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు హిందీ మార్కెట్‌లో బన్నీ సినిమాల ప్రదర్శన చూసుకుంటే, “పుష్ప 1″(Pushpa) సినిమాతో బేస్ బలంగా ఏర్పడింది. ఆ చిత్రం 108 కోట్లతో ముగియగా, పుష్ప 2 దాని వసూళ్లను ఏకంగా నాలుగు రెట్లు పెంచుకుంది.
ఈ సక్సెస్‌తో బన్నీ, పాన్-ఇండియా మార్కెట్‌లో తన స్థానాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. నార్త్ ఆడియన్స్‌కు బన్నీ స్టైల్, పుష్పరాజ్ పాత్ర పూర్తి స్థాయిలో కనెక్ట్ అయ్యింది. “పుష్ప 2” లాంగ్ రన్‌లో 1000 కోట్ల హిందీ మార్కెట్ గ్రాస్ కలెక్షన్లను టార్గెట్ చేస్తోంది. ఈ సినిమా సక్సెస్ సౌత్ సినిమాలకు హిందీ మార్కెట్‌లో కొత్త ట్రెండ్ గా నిలుస్తుందని చెప్పడంలో సందేహమే లేదు.