బాయ్ ఫ్రెండ్ రూమర్ పై స్పందించిన శృతి హాసన్!
- May 26, 2017 / 11:45 AM ISTByFilmy Focus
మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ శృతి హాసన్ పై కొన్ని నెలలుగా రూమర్లు ఆగడం లేదు. తాను బాయ్ ఫ్రెండ్స్ పై కలిసి ముంబై లో నివసిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై శృతి రీసెంట్ గా స్పందించింది. ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇప్పుడు తనకి బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరని స్పష్టం చేసింది. “లండన్ కి చెందిన నటుడు, మ్యూజిక్ డైరక్టర్ మైఖేల్ కోర్సేలే, నేను మంచి ఫ్రెండ్స్.
అతనితో కలిసి కొన్ని నెలలు పాటు కలిసి ఉన్నాను. ఆ తర్వాత అర్ధమయింది .. మా ఇద్దరి మధ్య ప్రేమ లేదని.. ఆకర్షణ మాత్రమే ఉందని. అందుకే విడిపోయాము. ఇప్పుడు నేను సింగిల్” అని వెల్లడించింది. ఇక కాటమరాయుడులో మంచి డ్రస్సులు వేయలేదనే విమర్శలపై కూడా తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. నాన్ను విమర్శించే వారికీ తాను మాటలతో కాకుండా సినిమాలతో సమాధానం చెబుతానని వివరించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













