సినిమాల్లో హీరోయిన్లు అందాలను చూపించాలా? వద్దా? అనే అంశం ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కోట్లు ఇచ్చేది విప్పి చూపించడానికే అంటూ తమిళ దర్శకుడు సురాజ్ చేసిన కామెంట్స్ పై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా పై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో డైరక్టర్ క్షమాపణలు చెప్పి, తన మాటలను వెనక్కి తీసుకున్నారు. తాజాగా మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ శృతిహాసన్ చేసిన స్టేట్ మెంట్స్ సంచలనానికి దారితీసాయి.
” హీరోయిన్లు స్కిన్ షో చేయడంలో ఏమాత్రం తప్పు లేదని” అని విశ్వనటుడు కుమార్తె వెల్లడించింది. “కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు బాగా నటించడంతో పాటు, గ్లామర్ గా కనిపించడం అవసరం” అని తన అభిప్రాయాన్ని దైర్యంగా చెప్పింది. కథ డిమాండ్ మేరకు హీరోయిన్లు అందాలారబోయాల్సిన అవసరం ఉంటుందని పరోక్షంగా సురాజ్ కి మద్దతు తెలిపారు. ఈ మాటలపై ఎంతమంది స్పందిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.