అవకాశాలు లేకపోయినా బాగా ఢిమాండ్ చేస్తుంది..!

అతి తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శృతిహాసన్. కెరీర్ మొదట్లో ఈమెను ప్లాపులు పలకరించినా .. పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం నుండీ ఈమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అటుతరువాత వరుస స్టార్ హీరోల సరసన ఈమెకు అవకాశాలు వచ్చాయి. అంతేకాదు తరువాత ఈమె చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్టయ్యాయి. కానీ విదేశీ బాయ్ ఫ్రెండ్ తో ప్రేమాయణం నడిపి సినిమాలకు దూరమైంది. దీంతో ఈమె సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పినట్టే అని అందరూ అనుకున్నారు.

కానీ అనుకోని విధంగా ఈమె లవ్ బ్రేకప్ అవ్వడంతో ఇప్పుడు మళ్ళీ సినిమాల పై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తాను రవితేజ తో తెరకెక్కించబోయే సినిమా కోసం శృతి ని సంప్రదించాడట. గతంలో ఇదే కాంబినేషన్లో ‘బలుపు’ అనే సూపర్ హిట్ చిత్రం వచ్చింది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలని భావించాడట గోపి. అయితే శృతిహాసన్ మాత్రం ఈ చిత్రం కోసం ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందట. అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనకడుగు వేయడంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus