ఇండియన్ సినిమాలో బోల్డ్ యాక్టర్స్ అంటూ కొంతమంది ఉంటారు. వీళ్లు సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేయడమే కాదు… బయట కూడా అలానే మాట్లాడుతుంటారు. అలాంటివాళ్ల నుండి వచ్చే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వారిలో శ్రుతి హాసన్ ఒకరు. నటిగా మాత్రమే కాకుండా సినిమాలోని వివిధ విభాగాల్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల ఆమె తన కెరియర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేసింది.
అలసిపోయిన భావం కలగనప్పుడు ఆ రోజు ఎదురైన అనుభవం సరైనది కాదు అని అనుకుంటాను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది శ్రుతి కమర్షియల్ కథా నాయికగా అగ్రతారల చిత్రాల్లో సందడి చేస్తూనే.. మరోవైపు నాయికా ప్రాధాన్య సినిమాలతోనూ మెప్పిస్తోంది శ్రుతి హాసన్. ఈ రెండు ప్రయాణాల్లో మీకు సంతృప్తినిచ్చేది ఏంటి అని అడిగితే.. ఇంట్లో ఉన్నట్లు ఆఫీసులో ఉండలేం.. అక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉండలేం. ఇదే సినిమాల విషయంలోనూ వర్తిస్తుంది అని చెప్పింది.
తాను (Shruti Haasan) ప్రధాన పాత్రలో నటిస్తున్నప్పుడు ఆ సినిమా సెట్లో ఉండే అనుభవం ఒకలా ఉంటుంది. అలాగే ఇతర తారల చిత్రాల్లో నటించేటప్పుడు అనుభవం వేరేలా ఉంటుంది. అయితే ఈ రెండింటిలోనూ తన కష్టం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. నటిగా తన పాత్రకు న్యాయం చేయడానికి నూటికి నూరు శాతం శ్రమపడతానని చెప్పిన శ్రుతి అలా కష్టపడి పని చేయడమంటేనే తనకు ఇష్టం అని చెప్పింది.
కష్టపడి పని చేసి మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్లడం కంటే మంచి అనుభూతి మరొకటి ఉండదు అని చెప్పింది శ్రుతి. రోజు చివరిలో అలా అలసిపోయిన ఫీలింగ్ రాలేదేంటే ఆ రోజు తన జీవితంలో చెత్త అనుభవమే అని చెప్పిందామె. ఇక శ్రుతి హాసన్ ప్రస్తుతం తెలుగులో అడివి శేష్‌తో ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తోంది. అలాగే ‘చెన్నై స్టోరీ’ అనే మల్టీ లాంగ్వేజ్ సినిమాలో నటిస్తోంది. ఇక ‘సలార్: శౌర్యాంగపర్వం’ ఎలానూ ఉంది.
భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!