Shruti Haasan: శ్రుతి హాసన్‌ ఆ రోజుల్లో ఎలా ఉందో చూశారా!

  • July 18, 2022 / 08:17 AM IST

స్టార్‌ కిడ్‌గా ఇండస్ట్రీలోకి వచ్చింది శ్రుతి హాసన్‌. అయితే నిజానికి ఆమె ఎప్పుడూ ఆ ఇమేజ్‌ను, పేరును ఉపయోగించుకోలేదు. ఎందుకంటే ఆమె చిన్నతనం నుండి తనదైన ముద్ర వేస్తూనే వచ్చింది. కమల్‌ హాసన్‌ తనయ అనే పేరును పెద్దగా ఎక్కడా వాడుకోలేదు. అలా ఐదేళ్ల వయసులోనే స్టేజీ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చింది. అప్పుడు ఆమె పాట పాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో చిన్ని శ్రుతిని చూసి నెటిజన్లు, అభిమానులు మురిసిపోతున్నారు.

చిన్నతనంలో తన స్టేజ్ పర్ఫామెన్స్‌కు సంబంధించిన వీడియోను శ్రుతి హాసన్‌ ఇటీవల షేర్ చేసింది. తన ఫ్యాన్స్‌ పేజీలోని వీడియో ఇది. ఆ వీడియోను షేర్‌ చేస్తూ దానికి వెలికి తీసిన తన ఫ్యాన్స్‌ను పొగిడేసింది కూడా. అప్పటి స్వీట్‌ మెమోరీస్‌ను గుర్తు చేసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పింది. ‘‘ఎంత గొప్ప మెమొరీ ఇది. స్టేజ్ ఎక్కి నేను పాట పాడిన తొలి సందర్భం ఇది. దీని కోసం నేను, డాడీ, మమ్మీ రిహార్సల్స్ చేశాం’’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకుంది శ్రుతి.

‘‘ప్రేక్షకులు, ఆహుతుల చప్పట్లు, ప్రోత్సాహం ఇచ్చే ఎనర్జీ ఎలా ఉంటుందో నాకు ఆ రోజే అర్థమైంది. నా నెక్స్ట్‌ లైఫ్‌ను ఎలా ఎంచుకోవాలో అర్థమైన క్షణమూ అదే. సింగపూర్ ప్రజలే నా మొట్టమొదటి ప్రేక్షకులు. తొర్రిపళ్లతో నేను పాడగలను అని నాకు అర్థమైంది’’ అంటూ ఆ వీడియోతోపాటు ఎమోషనల్ రాసుకొచ్చింది శ్రుతి హాసన్. చిన్నప్పుడు శ్రుతి ఎంత క్యూట్‌గా ఉంది అని కొందరు కామెంట్స్‌ చేస్తుంటే, ఎంత ముద్దుగా మాట్లాడుతుందో అని మరికొందరు రాస్తున్నారు.

ఇక ప్రజెంట్‌ సంగతి చూస్తే… శ్రుతి హాసన్ ఇప్పుడు చిరంజీవి, బాలయ్య సరసన నటిస్తోంది. NBK 107లో బాలయ్యతో నటిస్తుండగా, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్‌ అఫీషియల్‌గా చెప్పలేదు) సినిమాలో నటిస్తోంది. వీటితోపాటు ప్రభాస్ ‘సలార్’ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీటి విజయం మీదే ఆమె హీరోయిన్‌ కెరీర్ ఆధారపడి ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus