Shruti Haasan: చిరు, బాలయ్యతో నటించడంపై శ్రుతి కామెంట్స్‌!

యువ హీరోలతో ఇంకా యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ, అలరించి శ్రుతి హాసన్‌. నటన మాత్రమే కాకుండా, మిగిలిన రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు శ్రుతి కథల ఎంపిక, సినిమాల ఛాయిస్‌లు మారుతూ వస్తున్నాయి. సీనియర్లు, యువ హీరోలు అనే లెక్కలేవీ వేసుకోవడం మానేసింది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్‌ హీరోలతో నటించడానికి పచ్చ జెండా ఊపేస్తోంది. అసలు ఆమె ఇలా ఎందుకు చేస్తోంది అనే మాటలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.

తాజాగా ‘సీనియర్ల నాయిక’ అనే మాట గురించి స్పందించింది శ్రుతి హాసన్‌. కథ, పాత్రలు నచ్చితే ఏ సినిమా అయినా చేస్తా. అందులో మిగిలిన విషయాల గురించి పెద్దగా పట్టించుకోను అంటూ తేల్చిచెప్పేసింది. 12, 13 ఏళ్ల కథానాయిక ప్రయాణం తర్వాత నేను ఇంకా నాటి ఆలోచనలతో ఉంటే ఎలా కుదురుతుంది అంటూ తన కెరీర్‌ గురించి మాట్లాడింది శ్రుతి హాన్‌. అంతే కాదు తన కెరీర్‌ని గమనిస్తే ఎవరూ చేయని సాహసాలు కనిపిస్తాయి అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి.

నటిగా కొత్త ప్రయత్నం ప్రారంభించిన ప్రతిసారీ రకరకాల సందేహాలు తీసుకొస్తూ భయపెట్టేవాళ్లు ఉన్నారు. నాకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. అయితే నేను భయపడకుండా చేయాలనుకున్న పనే చేశా. ఇప్పుడు బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని సినిమాలో గమ్మత్తైన పాత్ర చేస్తున్నాను. ఆ పాత్ర అందరినీ అలరిస్తుందని పక్కాగా చెప్పగలను. నేను ఇప్పటివరకు చాలామంది దర్శకులతో కలిసి పనిచేశాను. గోపీచంద్‌ నన్ను ఎక్కువగా నమ్ముతుంటారు అని చెప్పింది శ్రుతి హాసన్‌. ఇక చిరంజీవితో బాబీ చేస్తున్న సినిమాలోనూ శ్రుతినే నాయిక అనే విషయం తెలిసిందే.

అంతేకాదు నటిగా తన గురించి తనకు నమ్మకం ఎప్పుడు కలిగిందనేదీ చెప్పింది శ్రుతి. ‘సెవెన్త్‌ సెన్స్‌’ కోసం దర్శకుడు మురుగదాస్‌తో కలసి పని చేశాకే… నటిగా తన మీద తనకు నమ్మకం కలిగిందట. ఆ కథ విన్నాక ఇంత పెద్ద పాత్ర, నేను చేయగలనా అని అనుకుందట శ్రుతి. అదే విషయాన్ని మురుగదాస్‌కి చెప్పిందట. దానికి ఆయన ‘నాకు నమ్మకం ఉంది, మరి నీకెందుకు లేదు?’ అని అడిగారాట. ఆ మాటే శ్రుతికి నమ్మకం పెంచిందట.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus