కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నటి శృతిహాసన్ కెరియర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇండస్ట్రీ లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె పలు సినిమాలలో నటించారు. అయితే ఈమె నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో చాలామంది ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు. ఇలా తన గురించి ఎన్నో రకాల విమర్శలు వస్తూ ఉన్నప్పటికీ ఈమె మాత్రం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ తనని తాను నిరూపించుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది శృతిహాసన్ కు గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఈ ఏడాది ఈమె ఏకంగా నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇండస్ట్రీలో ఇలా సక్సెస్ అందుకున్నటువంటి ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశారనే ప్రశ్న ఒక నేటిజన్ ఈవెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శృతిహాసన్ (Shruti Haasan) సమాధానం చెబుతూ తాను ఇండస్ట్రీలోకి రాకముందు డబ్బింగ్ ఆర్టిస్ట్, క్యాస్ట్యూమ్ అసిస్టెంట్, లైబ్రేరియన్‌గా పని చేసిందట. ఈ విషయాన్ని శృతి హాసన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఈమె సినిమాలతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!