Shruti Haasan: ‘ఇనిమేల్‌’… ఓ పాట వెనుక ఇంత జరిగిందా? ఎందుకనో?

లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj)… దర్శకుడిగా ఆయనకున్న ఇమేజ్‌ పూర్తి మాస్‌. ఎందుకంటే ఆయన చేసిన సినిమాల జోనర్‌ ఎక్కువగా అదే. అయితే మాస్‌లో అదో రకం అని అనాలి. అయితే ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన ఓ సాంగ్‌లో చూస్తే మాత్రం ఆయన జోనర్‌ మారిపోయింది. ఆ మార్పు కూడా మామూలు మార్పు కాదు… అదో రకమే అని చెప్పాలి. ఎందుకంటే స్టార్‌ హీరోయిన్‌తో ఈ స్టార్‌ దర్శకుడు చేసిన రొమాన్స్‌ అలా ఉంది.

మామూలుగా తన సినిమాల్లో రొమాన్స్‌ అంటే అంతగా ఇష్టపడని లోకేశ్‌ పాటలో మాత్రం బాగా పండిచాడు. దీంతో ఇప్పుడు ఈ విషయం మీదే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఆ పాట గురించి, అందులో రొమాన్స్‌ గురించి శ్రుతి హాసన్‌ (Shruti Haasan) చేసిన కొన్ని కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటని బ్యాక్ డ్రాప్‌గా తీసుకుని ‘ఇనిమెల్’ అనే వీడియో సాంగ్ తెరకెక్కించారు. ఈ పాటకు కమల్ హాసన్ (Kamal Haasan) లిరిక్స్‌ రాశారు. ఆయన బ్యానర్‌ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ లోనే తెరకెక్కింది.

సాంగ్ కాన్సెప్ట్, కంపోజింగ్ శ్రుతి హాసన్ చూసుకున్నారు. అంతేకాదు పాట చేయడానికి లోకేశ్ కనగరాజ్‌ ఇబ్బంది పడితే ఆమెనే అంతా చూసుకున్నారట. సాంగ్ గురించి చెప్పగానే లోకేష్ కనగరాజ్ శ్రుతితో యాక్ట్ చేయడానికి ఒప్పుకోలేదట. కాన్సెప్ట్ పూర్తిగా వివరించాక చేయడానికి ఒప్పుకున్నారని శ్రుతి తెలిపింది. లోకేశ్‌కు యాక్టర్ ఉండే అన్ని లక్షణాలు ఉన్నాయని, దర్శకుడిగా మంచి పేరుతో కొనసాగుతున్న లోకేష్ ఈ సాంగ్ లో బాగా నటించారని చెప్పింది.

ఇనిమేల్‌ పూర్తి పాట నిన్ననే అందుబాటులోకి వచ్చింది. కాబట్టి అనవసరంగా లోకేశ్‌ను టార్గెట్ చేసే జనాలు ఇక సైలెంట్ అయితే బెటర్ అని ఫ్యాన్స్‌ అంటున్నారు. అన్నట్లు ఆ పాట మీరు చూశారా? టీజర్‌లో కనిపించినట్లు కేవలం ఒక మూడ్‌లోనే పాట సాగదు. కొత్త జంట కొత్త లైఫ్‌ను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఒక్కో ఎలిమెంట్‌ యువతకు బాగా నచ్చేలా చూసుకున్నారు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus