శ్రుతి హసన్ ఓపెన్ అయిపోయింది!!
- February 11, 2017 / 06:26 AM ISTByFilmy Focus
టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు శ్రుతి హసన్ మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది….తొలి రోజుల్లో ఆమె ఎంట్రీ ఇచ్చిన తరువాత హిట్స్ విషయంలో వెనుక బడినప్పటికీ మెల్ల మెల్లగా పుంజుకుంటూ టాప్ హీరోయిన్ గా ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీల్లో చక్రం తిప్పుతుంది…ఇదిలా ఉంటే తాజాగా శ్రుతి కొన్ని సంచలన కామెంట్స్ చేసింది….ఎందుకు..ఏమయిందో తెలీదు కానీ…మొత్తానికైతే తన మనసులోని కొన్ని విషయాలను శ్రుతి బయటపెట్టింది…ఆమె సోషియల్ మీడియా వేదేకగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి….అసలు ఆ విషయం ఏమిటి అంటే…ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఓ సాంప్రదాయం వస్తుందని..సినిమా మంచి హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోకే వెళ్తుందని హీరోయిన్ల డమ్మిగా మిగిలిపోతున్నారని వాపోయింది.
అంతేకాకుండా….ఈ మద్య హీరోయిన్ల పరిస్థితి మరీ దారుణం అని నాలుగు పాటలు, మూడు డైలాగులు అన్న చందంగా సాగుతుందని అన్నారు. ఇక పెళ్లైన నాయికలు సినిమాలకు దూరమవ్వడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నిస్తూనే…తన విషయంలో అలాంటిది జరగదని శృతిహాసన్ నిర్మొహమాటంగా చెప్పింది. కథానాయికలు పెళ్లైన తర్వాత భర్తకు ఇష్టం లేదని, లేకుంటే అత్తగారు వద్దన్నారనో సినిమాలకు దూరం కావడం అత్యంత దారుణమైన పరిణామంగా శృతిహాసన్ పేర్కొంది. తనకు పెళ్లైనా.. పిల్లలు పుట్టినా కూడా నటిస్తూనే ఉంటానని శృతిహాసన్ క్లారిటీ ఇచ్చింది. నటన అంటే తనకు ప్రాణమని శృతిహాసన్ చెప్పింది. అయితే శ్రుతి చెప్పిన మాటలు వినడానికి బాగానే ఉన్నాయి కానీ… ప్ర్యాక్టికల్ గా వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఏమాత్రం లేదు అన్నది మనం చాలా మంది హీరోయిన్స్ విషయంలో చూశాం…మరి శ్రుతి చెప్పిన మాటకు నిలబడుతుందో లేదో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












