నిజానికి ‘పింక్’ సినిమాలో అయితే అమితాబ్ బచ్చన్ పాత్రకు హీరోయిన్ ఉండదు. కానీ ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్ తో ‘నేర్కొండ పార్వే’ గా రీమేక్ చేసినప్పుడు మాత్రం ఆయన ఫ్యాన్స్ ను శాటిస్ఫై చెయ్యడానికి హీరోయిన్ ట్రాక్ పెట్టారు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో రీమేక్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని.. హీరోయిన్ ట్రాక్ పెట్టారు.
అయితే దీనికి ‘నీరుకొండ పార్వే’ కు సంబంధం ఉండదట. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ముందుగా శృతీ హాసన్ ను తీసుకోవాలి అనుకున్నారు. అయితే ఆమె 20 నిమిషాల పాత్ర కోసం ఏకంగా 70 లక్షలు డిమాండ్ చేసిందట. అందుకు నిర్మాతలు భేరాలు ఆడటంతో.. శృతీ హాసన్ తప్పుకుందని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఆమె స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా ను తీసుకున్నారని తాజా సమాచారం. ‘వకీల్ సాబ్’ లో నటించడానికి తమన్నా కూడా ఓకే చెప్పేసిందట.
ఎలాగూ ఇప్పుడు తమన్నాకు పెద్ద సినిమాల్లో అవకాశాలు దొరుకుతాయి అన్న గ్యారెంటీ లేదు. దాంతో పవన్ సినిమాలో చిన్న రోల్ అని చెప్పినా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దీని పై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది తమన్నా.